ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షం ఉండాలి. 

భక్తి శ్రద్ధ లతో  హోమంలో ప్రత్యేక పూజలు.       --- జిల్లా ప్రజల  క్షేమం కోసం విశ్వశాంతి   మహాయాగం

స్వరూపా నందపనందస్వామిజీ ఆశీస్సులు పొందిన ఎమ్మెల్యే.
Published On
ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షం ఉండాలి. 

 

  వనపర్తి లోకల్ గైడ్ ప్రతినిధి సెప్టెంబర్ 13: 

  ప్రజల సుఖసంతోషాలు, సుభిక్షం, ఆయురారోగ్యాల కోసం నిర్వహిస్తున్న విశ్వశాంతి మహాయాగం ఎంతో పవిత్రమైనదని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. వనపర్తి పట్టణం మర్రికుంట లో చివరి రోజై న ఆదివారం ఎమ్మెల్యే మేఘారెడ్డి విశ్వాశాంతి యాగం లో పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేను శాలువ తో సన్మానించి యాగశాలకు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే  హోమంలో ప్రత్యేక పూజలు చేశారు.   IMG-20260913-WA0060
 వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య యాగ సంకల్పంలో భాగస్వాములై   శ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆశీస్సులు ఎమ్మెల్యే తీసుకున్నారు . ఈ సందర్భంగా ఆయన 
మాట్లాడుతూ  ప్రజల సుఖసంతోషాలు, సుభిక్షం, ఆయురారోగ్యాల కోసం నిర్వహిస్తున్న విశ్వశాంతి మహాయాగం ఎంతో పవిత్రమైనదన్నారు. ఆధునిక జీవన విధానంలో కనుమరుగవుతున్న మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను ఇటువంటి మహాయాగాలు భావితరాలకు పరిచయం చేస్తాయన్నారు. భక్తి, ధర్మం, సనాతన సంప్రదాయాల పరిరక్షణకు ఈ మహాయాగం ఒక చక్కని వేదికగా నిలుస్తోందని, ప్రజలందరూ ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.IMG-20260913-WA0057
కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ వారి సంకల్పంతో  విశ్వశాంతి మహాయాగం భక్తి, ఆధ్యాత్మికతతో శోభిల్లుతుందన్నారు. యాగశాలలో వేదఘోషలు, మంత్రోచ్ఛారణలు, హోమాగ్ని పరిమళాలతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుందని  ఆయన చెప్పారు. IMG-20260913-WA0059యాగం విజయవంతంగా కొనసాగాలని, స్వామీజీ వారి సంకల్పం నెరవేరి ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆయన కాంక్షించారు. ఎమ్మెల్యేలతో  పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కదిరె రాములు, జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతయ్య, స్థానిక కౌన్సిలర్ విభూది మహేశ్వరి, విజయలక్ష్మి పరుశురాం, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షు రమేష్ చంద్ర, బి కృష్ణ, పాల రవి, గొల్లరవి, విభూతి నారాయణ, పెబ్బేరు మండలాధ్యక్షులు యాపర్ల రామిరెడ్డి, మాజీ జెడ్పిటిసిలు గొల్ల వెంకటయ్య, రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News