హైదరాబాద్ మలక్సేట్ యశోదా హాస్పిటల్ లో ఆర్థ్రోస్కోపిక్ రొటేటర్ కఫ్ రిపేర్ సర్ అక్రోమియల్ డీకంప్రెషన్ +

ఎంజీహెచ్ఎల్ & ఐజిహెచ్ఎల్ క్యాప్సులర్ రిలీజ్తో డబుల్ రో రిపేర్ విజయవంతం

Published On
హైదరాబాద్ మలక్సేట్ యశోదా హాస్పిటల్ లో ఆర్థ్రోస్కోపిక్ రొటేటర్ కఫ్ రిపేర్ సర్ అక్రోమియల్ డీకంప్రెషన్ +

ఖమ్మం,ఆగస్టు,25: లోకల్ గైడ్:

ఖమ్మం యశోద మెడికల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో హైదరాబాద్ మలక్సేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ , స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ & ఆర్థ్రోస్కోపీ సర్జన్ డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం , డాక్టర్ E నరేష్ మాట్లాడుతూ భుజంలో నొప్పి వస్తే వయసు ప్రభావమో , ఎక్కువగా పనిచేయడం వల్లనో లేదా సాధారణ కండరాల నొప్పిగానో భావించి చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు . అయితే నొప్పి తగ్గకుండా కొనసాగుతూ చెయ్యి పైకి ఎత్తడం లేదా కదిలించడం కష్టంగా మారితే అది రొటేటర్ కఫ్ టియర్ కావచ్చు . భుజం కీలును స్థిరంగా ఉంచడంతో పాటు చెయ్యి కదలికలకు సహాయపడే టెండన్లు చీలిపోవడాన్ని రొటేటర్ కఫ్ టియర్ అంటారు . దీనికి సకాలంలో చికిత్స అందిందకపోతే చీలిక మరింత పెరిగి నొప్పి , బలహీనత , భుజం కదలికలు తగ్గిపోవడంతో పాటు రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టంగా మారవచ్చు . సకాలంలో ఆర్థోపెడిక్ నిపుణులను సంప్రదించి అత్యాదునిక ఆర్థ్రోస్కోపిక్ చికిత్స తీసుకోవడం ద్వారా దెబ్బతిన్న టెండన్ను సరిచేసి భుజం పనితీరును పునరుద్ధరించవచ్చు . ఇటువంటి సమస్యతో బాధపడుతున్న ఖమ్మంకు చెందిన 57 ఏళ్ల పులిచింతల బాశమ్మకు మలక్పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆర్థోపెడిక్ వైద్యబృందం విజయవంతంగా చికిత్స అందించింది . ఆమె కొంతకాలంగా కుడి భుజంలో నిరంతర నొప్పితో పాటు చెయ్యి కదలికలు తగ్గిపోవడంతో బాధపడుతున్నారు . సమగ్ర వైద్య పరీక్షలు , అవసరమైన పరిశోధనల అనంతరం ఆమె కుడి భుజంలో రొటేటర్ ఆఫ్ టియర్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు . టెండన్ చీలిక స్వభావంతో పాటు భుజం కదలికలు పరిమితం కావడాన్ని పరిగణనలోకి తీసుకుని , దెబ్బతిన్న రొటేటర్ కప్ను సరిచేసి భుజం కదలికలను మెరుగుపరిచేందుకు అత్యాధునిక ఆర్థ్రోస్కోపిక్ రిపేర్ చేయాలని వైద్యబృందం నిర్ణయించింది . రొటేటర్ కఫ్ రిపేర్ తర్వాత విజయవంతంగా కోలుకోవడం . ప్రణాళికాబద్ధమైన పునరావాసం కూడా అంతే కీలకం . ప్రారంభ దశలో భుజాన్ని తగిన విధంగా స్థిరంగా ఉంచడం , ఆ తర్వాత నిపుణుల పర్యవేక్షణలో క్రమంగా కదలికల వ్యాయామాలు , ఫిజియోథెరపీ చేయడం ద్వారా భుజం కదలికలు , పనితీరును తిరిగి పొందవచ్చు అని అన్నారు . ఈ కార్యక్రమంలో మేనేజర్ సందీప్ , నాగార్జున , జాన్ బాబు , అసిస్టెంట్ మేనేజర్ రాజేష్ యశోద మెడికల్ సెంటర్ మరియు పేషెంట్ భాషమ్మ , అటెండర్ బిందు పాల్గొన్నారు .

Tags:

About The Author

Latest News