22-ఏ నిషేధిత జాబితా నుంచి అర్హత ఉన్న భూములను తొలగించి రైతులకు న్యాయం చేయాలి

లక్షలాది రూపాయలు లంచాల పేరుతో రైతులను పీడిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి*

షాద్‌నగర్ ఎమ్మార్వో, సబ్‌-రిజిస్ట్రార్ అధికారులకు వినతిపత్రాలు సమర్పించిన బీజేపీ షాద్‌నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
Published On
22-ఏ నిషేధిత జాబితా నుంచి అర్హత ఉన్న భూములను తొలగించి రైతులకు న్యాయం చేయాలి

 

 


 లోకల్ గైడ్ తెలంగాణ/ రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ 
షాద్‌నగర్: 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న అర్హత కలిగిన ప్రైవేట్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి, భూభారతి రికార్డుల్లో అవసరమైన సవరణలు చేసి రైతులకు న్యాయం చేయాలని బీజేపీ షాద్‌నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో షాద్‌నగర్ ఎమ్మార్వో, సబ్‌-రిజిస్ట్రార్ అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. 22-ఏ జాబితాలో తమ భూములు ఉండటంతో రైతులు రిజిస్ట్రేషన్, క్రయవిక్రయాలు, ఇతర భూ లావాదేవీలు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అర్హత ఉన్న భూములను నిషేధిత జాబితాలో కొనసాగించడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు.

భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాలను ఆశ్రయిస్తున్న రైతులను కొంతమంది అధికారులు, సిబ్బంది లంచాల పేరుతో వేధిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. సమస్య పరిష్కారం కోసం లక్షలాది రూపాయలు లంచాల రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి ఉంటే, దీనిపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు వెంటనే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

భూభారతి ద్వారా భూ రికార్డుల సవరణకు అవకాశం ఉన్నందున, 22-ఏ జాబితాలో ఉన్న భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హత ఉన్న భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరారు. రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా పారదర్శకంగా, అవినీతి రహితంగా భూ సమస్యలను పరిష్కరించాలని అన్నారు.

రైతుల భూ హక్కులను కాపాడుతూ, వారికి త్వరితగతిన న్యాయం చేయాలని అధికారులను విష్ణువర్ధన్ రెడ్డి కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఎస్ టి  మోర్చ్ అధ్యక్షుడు మోహన్ సింగ్ నాయక్, జిల్లా కార్యదర్శి ఈసునాతి శ్రీనివాస్, షాద్‌నగర్ నియోజకవర్గ ధార్మిక సెల్ కన్వీనర్ పసుల నర్సింహ యాదవ్, కొత్తూరు మండల అధ్యక్షుడు అత్తాపూర్ మహేందర్ రెడ్డి, సర్పంచులు రాజు నాయక్, బోయ అశోక్, ఉపసర్పంచులు గంగాధర్, సుమన్ గౌడ్, టౌన్ ఉపాధ్యక్షుడు అల్లం అనిల్ కుమార్ గౌడ్, ఫరూక్‌నగర్ మండల ప్రధాన కార్యదర్శి రఘు గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు, కమ్మదనం  శ్యామ్ సుందర్ రెడ్డి, అంజయ్య, నరేందర్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, భాస్కర్ పటేల్, కేశంపేట బీజేవైఎం నాయకులు వేణు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News