- District News
- Ranga Reddy
- క్షేత్ర స్థాయిలో పశువైద్యులు పరిజ్ఞానంతో పాటు శస్త్రచికిత్సలో నైపుణ్యాలు సాధించాలి - వెటర్నరీ యూనివర...
క్షేత్ర స్థాయిలో పశువైద్యులు పరిజ్ఞానంతో పాటు శస్త్రచికిత్సలో నైపుణ్యాలు సాధించాలి - వెటర్నరీ యూనివర్సిటీ డీన్ ఆఫ్
ఫ్యాకల్టీ ప్రొఫెసర్ ఉదయ్ కుమార్.
రాజేంద్రనగర్, (లోకల్ గైడ్ ): క్షేత్రస్థాయిలో పశు వైద్యులు పరిజ్ఞానంతో పాటు శస్త్రచికిత్సలో నైపుణ్యాలు సాధించడం ఎంతో అవసరం అని వెటర్నరీ యూనివర్సిటీ డీన్ ఆఫ్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ ఉదయ్ కుమార్ అన్నారు. బుధవారం రాజేంద్రనగర్ లోని పి.వి. నరసింహరావు తెలంగాణ వశువైద్య విశ్వవిద్యాలయం, పశువైద్య కళాశాల, పశువైద్య శస్త్రచికిత్స, రేడియాలజీ విభాగం ఆధ్వర్యంలో భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి షెడ్యూల్డ్ కాస్ట్ సబ్ ప్లాన్ (ఐసీఏఆర్-ఎస్సీ ఎస్పీ) ఆర్థిక సహకారంతో "చివరి సంవత్సరం బి.వి.ఎస్సీ ఏ. హెచ్, షెడ్యూల్డ్ కాస్ట్ విద్యార్థులకు క్షేత్ర స్థాయి పశువైద్యులకు కంపానియన్ జంతువుల ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలో జ్ఞాన, నైపుణ్యాభివృద్ధి ద్వారా జీవనో పాధి, ఔత్సాహికతాభివృద్ధి'అనే అంశంపై నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలను ప్రొ. ఉదయ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నేటి పోటీ ప్రపంచంలో క్షేత్ర పశువైద్యులు పాఠ్యాంశ పరిజ్ఞానంతో పాటు శస్త్రచికిత్సలో ప్రయోగించిన నైపుణ్యాలను కూడా తప్పనిసరిగా అలవర్చుకోవాలని సూచించారు. కంపానియన్ జంతువుల వైద్యంలో పెరుగుతున్న అవకాశాల ను సద్వినియోగం చేసుకుని, ఇటువంటి నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు భవిష్యత్తులో ఉత్తమ పశువైద్య నిపుణులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పశువైద్య కళాశాల అసోసియేట్ డీన్ ప్రొ. మాధురి మాట్లాడుతూ విద్యార్థుల కు నాణ్యమైన విద్యతో పాటు ప్రాయోగిక శిక్షణ అందించడం విశ్వవిద్యాలయం ప్రధాన లక్ష్యమని తెలిపారు. శిక్షణా కార్యక్రమం ప్రధాన పరిశోధకులు, సమన్వయకర్త ప్రొ. జె. రాధాకృష్ణారావు స్వాగతోపన్యాసం చేస్తూ కంపానియన్ జంతువులలో ఆర్థోపెడిక్ సమస్యలను గుర్తించడం, ఆధునిక శస్త్రచికిత్సా పద్ధతులపై విద్యార్థులకు ప్రయోగాత్మక శిక్షణ అందించడమే ప్రధాన ఉద్దేశ్యమన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణలో ఆధునిక శస్త్రచికిత్సా విధానాలు, క్లినికల్ నైపుణ్యాలు, ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. చివరగా ప్రొ జె. రాధాకృష్ణారావు కృతజ్ఞతలు తెలుపుతూ, ముఖ్య అతిథి ప్రొ. ఉదయ కుమార్ & డా. మధుసూదన్ గౌడ్, కార్యక్రమ అధ్యక్షులు ప్రొ. డి. మాధురి, శిక్షణ కార్యక్రమ విజయవంతానికి సహకరించిన, డా. పద్మశ్రీ, డా. ప్రవళిక, , డా. దినేష్, డా. ప్రీతి, డా. అరవింద్లకి ధన్యవాదాలు తెలిపారు.
