- District News
- Khammam
- మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు –
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు –
సాహిత్య స్ఫూర్తి సభ
మధిర, సెప్టెంబర్,9:: లోకల్ గైడ్:
కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల, మధిర ప్రిన్సిపాల్ G.శంకర్. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ
తెలంగాణ ప్రజాకవి, స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక చైతన్యవాది, పద్మవిభూషణ్ కాళోజి నారాయణరావు జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాము.
కాళోజి గారు తన రచనల ద్వారా సామాన్య ప్రజల బాధలను, వారి ఆకాంక్షలను, సమాజంలోని అసమానతలను ప్రపంచానికి తెలియజేశారు. ప్రజల పక్షాన నిలబడి, అన్యాయాన్ని ప్రశ్నించడం ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన లక్షణం. అందుకే ఆయనను తెలంగాణ ప్రజలు ప్రేమగా ప్రజాకవి గా గౌరవించారు.
విద్యార్థులైన మీరు కాళోజి గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నిజాయితీ, ధైర్యం, సామాజిక బాధ్యత, మానవత్వం వంటి విలువలను అలవర్చుకోవాలి. తప్పును చూసి మౌనంగా ఉండకుండా, న్యాయం కోసం ప్రశ్నించే ధైర్యాన్ని పెంపొందించుకోవాలి
మన మాతృభాషను, మన తెలంగాణ సంస్కృతిని గౌరవించడం ద్వారా కాళోజి గారికి నిజమైన నివాళి అర్పించగలము.
ఈ కార్యక్రమంలో NSS PO B. తౌరియా Rలత,U కృష్ణ,Pకమల,R CH సాంబయ్య,G కృష్ణ,K గురవయ్య,B ఉపేందర్,Gవిక్రమ్,T దేవదాస్,T నాగరాజు,M లాలయ్య, K కొండలరావు మరియు విద్యార్థిని విద్యార్థులు అధ్యాపక అధ్యాపకేతర బృందం పాల్గొని ఉన్నారు.
