- District News
- కూకట్‌పల్లి, కుషాయిగూడలో ఆర్‌ఎస్‌బీ ఫ్యాక్టరీ అవుట్‌లెట్ మెగా సేల్స్
కూకట్‌పల్లి, కుషాయిగూడలో ఆర్‌ఎస్‌బీ ఫ్యాక్టరీ అవుట్‌లెట్ మెగా సేల్స్
నిజాంపేట్, అమీర్‌పేట్‌లో నిర్వహించిన ఫ్యాక్టరీ అవుట్‌లెట్ మెగా సేల్స్‌కు విశేష స్పందన లభించిన నేపథ్యంలో ఆర్‌ఎస్‌బీ సంస్థ కూకట్‌పల్లి, కుషాయిగూడలో డబుల్ ధమాకా మెగా సేల్స్ ఎగ్జిబిషన్లను బుధవారం ప్రారంభించింది. ప్రముఖ టీవీ వ్యాఖ్యాత రష్మి గౌతమ్ ఈ ఎగ్జిబిషన్లను ప్రారంభించారు.
రాబోయే పండుగలు, పర్వదినాలను దృష్టిలో ఉంచుకుని అన్ని వయసుల వారి అభిరుచులకు అనుగుణంగా సంప్రదాయ, ఆధునిక శైలుల్లో రూపొందించిన వస్త్రాలు, హోమ్ ఫర్నిషింగ్ ఉత్పత్తులను ఎగ్జిబిషన్‌లో అందుబాటులో ఉంచారు. నాణ్యతతో పాటు పొదుపు ధరలకు ఉత్పత్తులను అందించడమే ఈ మెగా సేల్స్ ప్రత్యేకతగా నిర్వాహకులు తెలిపారు.
కూకట్‌పల్లి ఎగ్జిబిషన్‌లో పట్టుచీరలు, ఎత్నిక్ డ్రెస్ మెటీరియల్స్, డైలీవేర్, పార్టీ వేర్‌తో పాటు పురుషుల ఫార్మల్, క్యాజువల్, ట్రెడిషనల్ దుస్తులు అందుబాటులో ఉన్నాయి. చిన్నారుల కోసం వివిధ వయసులకు సరిపోయే రంగురంగుల దుస్తులతో పాటు ప్రీమియం బెడ్‌షీట్లు, కర్టెన్లు, బాత్ టవల్స్ తదితర హోమ్ ఫర్నిషింగ్ ఉత్పత్తులను కూడా ఏర్పాటు చేశారు.
కూకట్‌పల్లి ఎగ్జిబిషన్ సెప్టెంబర్ 9 నుంచి 17వ తేదీ వరకు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణ మండపంలో కొనసాగనుంది. కుషాయిగూడ ఎగ్జిబిషన్ సెప్టెంబర్ 9 నుంచి 16వ తేదీ వరకు ఈసీఐఎల్ ‘ఎక్స్’ రోడ్స్ సమీపంలోని శ్రీలక్ష్మి కన్వెన్షన్‌లో నిర్వహించనున్నారు.
రెండు ప్రాంతాల్లోనూ నేరుగా ఫ్యాక్టరీ నుంచి వచ్చిన ఉత్పత్తులను హోల్‌సేల్ ధరలకు ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని ఆర్‌ఎస్‌బీ యాజమాన్యం తెలిపింది. కూకట్‌పల్లి, కుషాయిగూడ పరిసర ప్రాంతాల వస్త్ర, షాపింగ్ ప్రియులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు.
