- District News
- Ranga Reddy
- డీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపికకు సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం.
డీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపికకు సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం.
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా ఏఐసీసీ సూచనల మేరకు సంఘటన్ సృజన్ అభియాన్ ద్వారా క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని కర్ణాటక ఎమ్మెల్సీ, ఏఐసీసీ కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా అబ్జర్వర్ పి.వి. మోహన్ తెలిపారు.
ఆదివారం రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో శంషాబాద్ మండలం తొండుపల్లి గ్రామంలోని మనస్వి గార్డెన్స్‌లో రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సంస్థాగత సంప్రదింపుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పి.వి. మోహన్ మాట్లాడుతూ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ ఆలోచనలు, మార్గదర్శకత్వంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే సంఘటన్ సృజన్ అభియాన్ ప్రధాన లక్ష్యమన్నారు. రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, అందరినీ కలుపుకుని ముందుకు సాగడమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని పేర్కొన్నారు.
సంఘటన్ సృజన్ అభియాన్ ద్వారా బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేసి, ప్రజలకు చేరువైన బలమైన సంస్థాగత నిర్మాణాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యమని పి.వి. మోహన్ తెలిపారు. డీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపికలో క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలకు పూర్తి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. పార్టీని సమర్థవంతంగా, అందరిని కలుపుకుని పనిచేసే నాయకత్వాన్ని పారదర్శకమైన విధానంలో ఎంపిక చేస్తామన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ అబ్జర్వర్లు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సత్తుపల్లి శాసనసభ్యులు డా. మట్టా రాగమయి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇ.వి. శ్రీనివాస్ రావు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్ ధనుంజయ్, జి శేఖర్ యాదవ్, కృష్ణారెడ్డి సంజయ్ యాదవ్, జలపల్లి నరేందర్ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మైలారం సులోచన, డివిజన్ అధ్యక్షులు దూడల వెంకటేష్ గౌడ్, సామా ఇంద్రపాల్ రెడ్డి, సి మహేందర్ ముదిరాజ్, బొబ్బిలి శేఖర్ ముదిరాజ్, ప్రేమ్ గౌడ్, పి శ్రీధర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మహమ్మద్ గౌస్, మహమ్మద్ షౌకత్, నరేందర్ మెరుగు జితేందర్, దుర్గేష్ యాదవ్, కోటేష్ గౌడ్, రవి నాయక్, రాము నాయక్, మహమ్మద్ ఖలీల్, చందు లు తమ అభిప్రాయాలు, పార్టీ అభివృద్ధికి సంబంధించిన సూచనలు తెలియజేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.
