- District News
- Ranga Reddy
- ఆమనగల్లులో ఘనంగా శ్రీ సుర్ర సముద్రం కట్ట మైసమ్మ తల్లి ద్వితీయ వార్షికోత్సవం
ఆమనగల్లులో ఘనంగా శ్రీ సుర్ర సముద్రం కట్ట మైసమ్మ తల్లి ద్వితీయ వార్షికోత్సవం
భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. బోనాల సమర్పణ.. పూర్ణాహుతి.. అన్నప్రసాద వితరణ
లోకల్ గైడ్
ఆమనగల్లు, ఆగస్టు 23:
ఆమనగల్లు పట్టణ కేంద్రంలోని సుర్ర సముద్రం చెరువు కట్ట వద్ద కొలువుదీరిన శ్రీ కట్ట మైసమ్మ తల్లి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. దేవాలయ కమిటీ చైర్మన్, 14వ వార్డు కౌన్సిలర్ ముక్తాల వెంకటయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
వార్షికోత్సవ వేడుకలకు సద్గురు శాంకరి అఘోరి మాత హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాభిషేకం, బోనాల సమర్పణ, గణపతి పూజ, కంకణధారణ, పూర్ణాహుతి తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో కిటకిటలాడింది.
తెల్లవారుజామునే ప్రారంభమైన పూజా కార్యక్రమాలు
ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో వార్షికోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం 6 గంటలకు పంచామృతాభిషేకం, 7 గంటలకు ప్రత్యేక పూజలు, 7.30 గంటలకు కంకణధారణ, 8 గంటలకు గణపతి పూజ నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణతో పాటు ఆలయ సంప్రదాయాల ప్రకారం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
మధ్యాహ్నం 12 గంటలకు పూర్ణాహుతి, 12.30 గంటలకు తీర్థప్రసాద వితరణ, ఒంటి గంటకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ప్రముఖుల హాజరు
ఈ వార్షికోత్సవ వేడుకల్లో జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, పీసీబీ ఠాకూర్ బాలాజీ సింగ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ యాట గీత, ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ పత్యా నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
అలాగే హుజూర్‌నగర్ సీఐ చలమంద రాజు, ఎస్‌ఐ, కౌన్సిలర్లు పాపిశెట్టి రాము, ఎర్రవోలు మహేష్, ఎనుమల్ల రమేష్, కో-ఆప్షన్ సభ్యులు అల్లాజీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు అవ్వారి శివలింగం, మాజీ కౌన్సిలర్ విజయకృష్ణ, సుండూరు ఝాన్సీ శేఖర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు తదితరులు హాజరయ్యారు.
పాతకోట శ్రీశైలం, గోరటి భరత్, లండం మల్లేష్, పురుగుల శివ, గంగా రవి, చెన్నంశెట్టి మల్లేష్, మనీ తదితరులతో పాటు ఆలయ కమిటీ సభ్యులు, ముక్తాల చిన్న వెంకటయ్య, ముక్తాల అంజయ్య, ఎర్రవోలు రాజు, మొక్తాల సాయి, ముక్తాల మని తదితరులు పాల్గొన్నారు.
భక్తులతో కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం
ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల సమర్పణ, ప్రత్యేక పూజలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడంతో కార్యక్రమం ప్రశాంతంగా, వైభవంగా కొనసాగింది. శ్రీ కట్ట మైసమ్మ తల్లి ఆశీస్సులు ఆమనగల్లు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని భక్తులు ఆకాంక్షించారు.
