- District News
- Ranga Reddy
- శెట్టిపల్లి లో పులి సంచారం అంటూ ప్రచారం.. అంతలోనే ట్విస్ట్
శెట్టిపల్లి లో పులి సంచారం అంటూ ప్రచారం.. అంతలోనే ట్విస్ట్
హైనా సంచరిస్తున్నట్లు గుర్తించిన అటవీ అధికారులు.. భయాందోళన చెందొద్దని గ్రామస్తులకు సూచన
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం శెట్టిపల్లి గ్రామంలో పులి సంచరిస్తోందంటూ ప్రచారం జరగడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ సమాచారం అందుకున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గురుప్రసాద్ వెంటనే స్పందించి అటవీ సిబ్బందితో కలిసి శెట్టి పల్లి గ్రామానికి చేరుకున్నారు.
గ్రామ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పరిశీలన చేపట్టిన అధికారులు, స్థానికులు తెలిపిన వివరాలను సేకరించారు. అక్కడ కనిపించిన జంతువును పరిశీలించిన అనంతరం అది పులి కాదని, హైనా (దుమ్మపిల్లి) సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో పులి సంచారం అంటూ వ్యాపించిన ప్రచారంతో ఆందోళనకు గురైన గ్రామస్తులకు కొంత ఊరట లభించింది.
ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గురుప్రసాద్ మాట్లాడుతూ.. గ్రామస్తులు ఎలాంటి భయాందోళనలకు గురికావద్ద ని సూచించారు. రాత్రి వేళల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామ శివారు ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. వన్యప్రాణుల సంచారం కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
