- District News
- Ranga Reddy
- న్యూ మాక్స్ కుంఫూ లో కొందుర్గ్ విద్యార్థుల అసమాన ప్రతిబా
న్యూ మాక్స్ కుంఫూ లో కొందుర్గ్ విద్యార్థుల అసమాన ప్రతిబా
మొదటి జె ఎస్ కె నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్ - 2026 లో ఐదు గోల్డ్ మెడల్ లు..."
లోకల్ గైడ్ న్యూస్ 09 కొందుర్గ్..
కొందుర్గ్ మండలానికి చెందిన న్యూ మాక్స్ కుంఫూ విద్యార్థులు
నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో 2026 లో అసమాన ప్రతిభ ను కనబరిచారు ఈ పోటీలలో ఇరవైకి పైగా విద్యార్థులు పాల్గొనగా వారిలో
కె కార్తీక్, ,మడియా ,బేగం ,చరణ్
తనిషతేజ్ ,జాన్నిఫా ,తన్విక,గోల్డ్ మెడల్ సాధించగా ఐశ జశ్వాన్ తనీష్ తేజ్ లు మాత్రం సిల్వర్ మెడల్ సాధించింది..ఐదుగురు విద్యార్థులు గోల్డ్ మెడల్ ఇద్దరు విద్యార్థులు సిల్వర్ మెడల్స్ సాధించి మిగతా విద్యార్థులు ప్రశంసా పత్రాలను అందుకున్నారు
హైదరాబాద్‌లోని చంపాపేట్, మందా మల్లారెడ్డి కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించిన మొదటి జె ఎస్ కె నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్ - 2026" పోటీలలో కొందుర్గు "న్యూ మంక్స్ కుంగ్ పూ" విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. వివిధ విభాగాల్లో పోటీపడిన విద్యార్థులు తమ అద్భుతమైన ప్రతిభతో మెడల్స్, ట్రోఫీలు మరియు ప్రశంసా పత్రాలు సాధించి కొందుర్గు మండలానికి వన్నె తెస్తూ కీర్తిని పెంచారు
.
ఈ కార్యక్రమంలో కొందుర్గు న్యూ మాక్స్ కుంఫూ ఇన్స్ట్రక్టర్ సీనియర్ మాస్టర్ జిల్లెల్ల రమేష్, ప్రభు, మాస్టర్ నందు, కార్తీక్ మరియు కర్ణాకర్ పాల్గొని విజేతలైన విద్యార్థులను అభినందించి,వారి ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతూ విద్యార్థులకు విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.....
