రైతుల సమస్యలపై జిల్లా అధికారులు వెంటనే స్పందించాలి.

బిజెపి పట్టణ కార్యదర్శి బ్యాటరీ రాజు 

Published On
రైతుల సమస్యలపై జిల్లా అధికారులు వెంటనే స్పందించాలి.

నారాయణపేట ఆగస్టు 9:
 మక్తల్ నియోజకవర్గం, మక్తల్ మండల పరిధిలో రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను, మండల ఎలక్ట్రికల్  సబ్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యాన్ని  తీవ్రంగా ఖండిస్తున్ననని రైతు సమస్యలపై జిల్లా కలెక్టర్,జిల్లా విద్యుత్ అధి కారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని మక్తల్ బిజెపి కార్యదర్శి బ్యాటరీ రాజు ఒక ప్రకటనలో కోరా రు.కొంతమంది రైతులు అగ్రికల్చర్ డీడీలు చెల్లించి నెలలు, సంవత్సరం గడుస్తున్నా ఇప్పటివరకు ట్రాన్స్‌ఫార్మర్లు, కరెంట్ పోల్స్, సంబంధిత వైర్లు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అగ్రి కల్చర్ డీడీలు చెల్లించిన తర్వాత కూడా విద్యుత్ సౌకర్యం అందక రైతుల పంటలు ఎండిపోయే పరి స్థితి ఏర్పడుతోందని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.ముఖ్యంగా మండల ఎలక్ట్రికల్ సబ్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడు తున్నారు. రైతులకు అవ సరమైన ట్రాన్స్‌ఫార్మర్లు, కరెంట్ పోల్స్, వైర్లు సమ యానికి అందించి పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, పనులు సమ యానికి పూర్తి చేయకుండా రైతులను రోజుల తరబడి తిప్పుకుంటున్నారని తెలిపారు. సబ్ కాంట్రా క్టర్‌కు ఎప్పుడు ఫోన్ చేసి నా “ఇప్పుడు చేస్తాను, అప్పుడు చేస్తాను” అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారనీ అన్నారు.కానీ రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.సబ్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని రైతుల సమస్యలు పరిష్కరించాలనీ కోరారు.
ఫోటో రైట్ అప్:7.బ్యాటరీ రాజు 
____________________

Tags:

About The Author

Latest News

గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు. గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు.
లోకల్ గైడ్/ తాండూర్ గంజాయి అక్రమ విక్రయాలు, రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పెద్దేముల్ ఎస్సై ఎం. ప్రశాంత్ వర్ధన్ హెచ్చరించారు. ఆదివారం గంజాయి...
పాముకాటుతో మహిళ మృతి.
బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు సెప్టెంబర్ 9 చివరి గడువు..
అత్తా పూర్ లో ఘనంగా కావడి యాత్ర.
తక్కువ ఖర్చుతో ప్రైవేట్ ఆసుపత్రులు పేదలకు మెరుగైన సేవలందించాలి 
శ్రావణ శోభలో ముత్యాలమ్మ బోనాలు