తహసిల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణాలకు మంత్రిచే శంకుస్థాపనలు 

Published On
తహసిల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణాలకు మంత్రిచే శంకుస్థాపనలు 

 

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్, ఆగస్టు 22 :

నిజామాబాద్ జిల్లాలోని వివిధ మండలాలకు మంజూరైన నూతన తహసీల్దార్ కార్యాలయాల భవనాలతో పాటు నిజామాబాద్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణాలకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం శంకుస్థాపనలు చేశారు.WhatsApp Image 2026-08-22 at 18.47.19 అదేవిధంగా గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమాలలో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరి లోకేష్ కుమార్, స్పెషల్ సెక్రెటరి రాజీవ్ గాంధీ హనుమంతు, హౌసింగ్ ఎం డీ గౌతమ్, కలెక్టర్ భవేష్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News