తాగునీటి కోసం రోడ్డెక్కిన తండా ప్రజలు.

గత 15 రోజులుగా తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు. పలుమార్లు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపణ

తక్షణమే నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ - సర్పంచ్ డౌన్ డౌన్’ అంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన
Published On
తాగునీటి కోసం రోడ్డెక్కిన తండా ప్రజలు.

లోకల్ గైడ్/తాండూర్:
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని కందనెల్లి తండాలో గత 15 రోజులుగా తాగునీరు సరఫరా కాకపోవడంతో తండావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉదయం తండా ప్రజలు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు.. ‘సర్పంచ్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. నీటి సమస్యను పలుమార్లు సర్పంచ్ ఆనంద్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.
తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని తండావాసులు కోరారు. అదేవిధంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వెంటనే స్పందించి తమ తాగునీటి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:

About The Author

Latest News

మట్టి గణపతిని పూజిద్దాం ప్రకృతిని కాపాడుకుందాం మట్టి గణపతిని పూజిద్దాం ప్రకృతిని కాపాడుకుందాం
లోకల్ గైడ్ షాద్ నగర్  కేశంపేట: వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కేశంపేట మాజీ జడ్పిటిసి విశాల...
ముందస్తు అరెస్టులు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు
ముగిసిన శ్రావణ మాస భజన కార్యక్రమం.
మహాదేవపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ ధర్నా
మట్టి వినాయకుని పూజిద్దాం..పర్యావరణాన్ని కాపాడుదాం* - కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో మట్టి వినాయకుల తయారీపై విద్యార్థులకు అవగాహన
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే మహాశిల్పులు గురువులు.
మృతురాలి రేషన్‌ కార్డుతో రెండేళ్లుగా బియ్యం స్వాహా? - చనిపోయిన బాలమ్మ పేరుతోనే కార్డు కొనసాగింపు.