- District News
- మత్స్యకారులకు సామాజి క భద్రత ...తెలంగాణ ప్రభుత్వ భరోసా
మత్స్యకారులకు సామాజి క భద్రత ...తెలంగాణ ప్రభుత్వ భరోసా
4.21 లక్షలకుపైగా మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా * ప్రమాదవశాత్తు మర ణం, వికలాంగతకు రూ.5 లక్షల వరకు బీమా రక్షణ
నారాయణపేట ఆగస్టు 10:
2026-27 ఆర్థిక సంవత్స రానికి రాష్ట్రంలోని 4,21, 767 మంది నమోదిత మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా పథకం అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీ సులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఒక ప్రకటన లో తెలిపారు. మత్స్యకారు ల సంక్షేమం, జీవనోపాధి భద్రత, సామాజిక రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రమా దవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యానికి గురైన మత్స్యకారుల కుటుంబాల కు ఆర్థిక భరోసా కల్పించా లనే ఉద్దేశంతో ఈ గ్రూప్ ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలి పారు.2026-27 సంవత్స రంలో 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు గల 4,21,767 మంది నమో దిత మత్స్యకారులు ఈ పథకం పరిధిలోకి వస్తారని మంత్రి వెల్లడించారు. ఒక్కో లబ్ధిదారునికి రూ.79.96 బీమా ప్రీమియం ఉండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ప్రీమి యం భరిస్తాయని తెలిపా రు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగారూ.21,34,79,673 చెల్లిస్తుందని, తద్వారా అర్హులైన మత్స్యకారులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండ దని స్పష్టం చేశారు.
ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే – రూ.5.00 లక్షలు,శాశ్వత సంపూర్ణ వైకల్యానికి – రూ.5.00 లక్షలు,శాశ్వత పాక్షిక వైకల్యానికి – రూ.2.50 లక్షలు, ప్రమాదవశాత్తు ఆసుపత్రిలో చికిత్స పొంది తే – గరిష్ఠంగారూ.25,000 వరకు వైద్య సహాయం
2026 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చే పాలసీ కాలంలో అర్హులైన ప్రతి నమోదిత మత్స్యకారుడికి నిరంతర బీమా రక్షణ అందేలా మత్స్యశాఖ అన్ని చర్యలు చేపట్టిందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.
మత్స్యకారుల కుటుంబా లకు ప్రమాద సమయంలో అండగా నిలవడంతో పాటు, వారి భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్య క్రమాల్లో భాగంగా గ్రూప్ ప్రమాద బీమా పథకం కీలక మైనదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదిత మత్స్యకారులు, వారి కుటుంబాలకు సమగ్ర సామాజిక భద్రత, ఆర్థిక రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.
ఫోటో రైట్ అప్:3.మంత్రి శ్రీహరి
_____________________
