గ్రామానికి వెలుగు వస్తే ప్రజలకు భద్రత ఉంటుంది.

మాజీ ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి.  ప్రజలకు ఉపయోగపడే పనులే నిజమైన అభివృద్ధి

మల్లాపూర్ సర్పంచ్ చిట్టేడి నరసింహారెడ్డి* *సొంత నిధులతో మల్లాపూర్ లో 04 ఐమాక్స్ లైట్స్ ఏర్పాటు*  హర్షం వ్యక్తం చేస్తున్న వివిధ గ్రామాల ప్రజలు
Published On
గ్రామానికి వెలుగు వస్తే ప్రజలకు భద్రత ఉంటుంది.

కొత్తూరు ఆగస్టు 10 (లోకల్ గ్రైడ్)

గ్రామానికి వెలుగు వస్తే ప్రజలకు భద్రత ఉంటుందని మాజీ ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి అన్నారు. కొత్తూరు మండలంలోని మల్లాపూర్ గ్రామంలో సర్పంచ్ చిట్టెడి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 4 ఐమాక్స్ లైట్స్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాత్రి విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్లే రైతులు,కార్మికులు, వ్యాపారులు అత్యవసర పనుల కోసం బయటకు వచ్చే ప్రజలకు కూడా ఈ లైటింగ్ ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఆయన అన్నారు.ఈ సందర్భంగా మల్లాపూర్ సర్పంచ్ నరసింహ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడకుండా సొంత నిధులతో గ్రామానికి అవసరమైన లైటింగ్ సదుపాయం కల్పించడం అభినందనీయమని మల్లాపూర్ సర్పంచ్ చిట్టెడి నరసింహారెడ్డి అన్నారు. ఐమాక్స్ లైట్స్ కేవలం విద్యుత్ దీపాలు మాత్రమే కాకుండా.. రాత్రి వేళల్లో ప్రజలకు భద్రతకు ప్రతికగా నిలుస్తాయని గ్రామస్తులు అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచులు రాములు గౌడ్,శంకర్ నాయక్, వార్డ్ సభ్యులు పవిత్ర జయేందర్ రెడ్డి,స్వాతి రాజేష్,జార్జ్ రెడ్డి,మాజీ సర్పంచులు రాజు,రవి నాయక్,నాయకులు పాపిరెడ్డి,దయానంద్ రెడ్డి, దామోదర్ రెడ్డి,పిన్నింటి సుభాష్ రెడ్డి,శేఖర్ రెడ్డి,కృష్ణ రెడ్డి,అంజి రెడ్డి,మురళీధర్ రెడ్డి, ఎస్ శేఖర్ రెడ్డి,నరేంద్ర రెడ్డి, జితేందర్ రెడ్డి,అక్బర్ పాషా, మహాత్మా రెడ్డి,పెంట రెడ్డి,చిర్రా రాజు,చిర్ర సుధాకర్,బోకుల రాజు,కాట్న శీను,సుధాకర్,చిర్ర దర్శన్,బైండ్ల దర్శన్, కృష్ణ,చిన్న,రఘు,చింటూ, సురేష్,శ్రీశైలం,శ్రీను,లింగం గౌడ్,పెండ్లిమడుగు రాజు గౌడ్, పీ మోహన్ నాయక్,ఆర్ మోహన్ నాయక్,తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వీరనాగమ్మ ఆలయ అభివృద్ధికి రూ.1.80 లక్షల సహకారం వీరనాగమ్మ ఆలయ అభివృద్ధికి రూ.1.80 లక్షల సహకారం
న్యూస్ స్టార్     లోకల్ గైడ్ – ఆమనగల్లు, ఆగస్టు 10: మాడుగుల మండలం దొడ్లపహాడ్ గ్రామంలో నూతనంగా విగ్రహ ప్రతిష్ఠాపన పూర్తిచేసుకున్న వీరనాగమ్మ దేవత ఆలయంలో 41...
అమ్మ’కు బోనాలు..జగతికి భాగ్యాలు
గ్రామానికి వెలుగు వస్తే ప్రజలకు భద్రత ఉంటుంది.
మత్స్యకారులకు సామాజి క భద్రత ...తెలంగాణ ప్రభుత్వ భరోసా
ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలి
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరించిన బీజేపీ 
తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి పెన్షన్ పథకం