హామీల అమలులో ప్రభుత్వం విఫలం. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్‌ గళం.

గ్రామాల అభివృద్ధిపై నిర్లక్ష్యం వీడాలి.

అవసరమైతే ప్రజల కోసం ఉద్యమిస్తాం.
Published On
హామీల అమలులో ప్రభుత్వం విఫలం. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్‌ గళం.

లోకల్ గైడ్/బంట్వారం:
 మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజా సమస్యలు, గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు, పార్కులు, మౌలిక వసతులు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని నాయకులు పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారంపై తక్షణమే దృష్టి సారించాలని కోరారు.
*ప్రజలే అంతిమ నిర్ణేతలు:*
అధికారం శాశ్వతం కాదని, ప్రజలే అంతిమ నిర్ణేతలని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అవసరమైతే ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. బంట్వారం మండలంలో బీఆర్ఎస్‌ను బలమైన ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, బీసీ కమిషన్ మాజీ అధ్యక్షుడు శుభప్రద్ పటేల్‌, మండల అధ్యక్షుడు, సర్పంచ్ దుర్గంచెరువు మల్లేశం, నాయకులు కాజపాష, అల్లాపురం శ్రీనివాస్‌, ఏనుగొంగ అశోక్‌, చంద్రశేఖర్‌, బలవంత్‌రెడ్డి, నరేష్‌, మందమీది శివకుమార్‌, బోపునారం శ్రీకాంత్‌, ఖదీర్‌, బుషనగారి ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News