పిడుగుపడి 6 గేదెలు మృతి

Published On
పిడుగుపడి 6 గేదెలు మృతి

 

నిర్మల్ : లోకల్ గైడ్:

సారంగాపూర్ మండలం
కౌట్ల(కే) గ్రామ శివారులో ఆదివారం పిడుగుపడి వేముల మోహన్, నరేష్, రాజేశ్వర్, చిన్నబాబు, భీమన్నలకు చెందిన 6 గేదెలు అక్కడికక్కడే మృతిచెందాయి. వర్షం వేళ చెట్టు కింద ఉన్న గేదెలపై పిడుగు పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కో గేదె విలువ రూ.60-80 వేల వరకు ఉంటుందని, జీవనాధారం కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఆర్‌వో ప్రభాకర్, వెటర్నరీ డాక్టర్ రాణి, ఎస్సై లింబాద్రి ఘటనా స్థలానికి వచ్చి పంచనామా జరిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు.

Tags:

About The Author

Latest News