- District News
- ఆకుపచ్చ తపస్సుకు దక్కిన అరుదైన గౌరవం
ఆకుపచ్చ తపస్సుకు దక్కిన అరుదైన గౌరవం
దైద వెంకన్నకు బెస్ట్ సోషల్ సర్వీస్ ఎక్సలెన్స్ అవార్డు
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ సెప్టెంబర్ 20
మహబూబాబాద్,
దైద వెంకన్న తన సేవలకు గాను ప్రతిష్టాత్మక *బెస్ట్ సోషల్ సర్వీస్ ఎక్సలెన్స్ అవార్డు ను అందుకున్నారు.ఆదివారం యాదాద్రి జిల్లా, ఆత్మకూర్ లోని పి.ఎస్ ఫంక్షన్ హాల్ లో భారత్ రక్తదాన్ మిషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వివిధ సేవా సంస్థల ప్రముఖుల చేతుల మీదుగా ఈ అవార్డును వెంకన్నకు అందజేశారు.ఈ సందర్భంగా దైద వెంకన్న మాట్లాడుతూ గత 32 సంవత్సరాలుగా సేవా రంగంలో ఉన్నాను.ఇప్పటివరకు 18 లక్షల మొక్కలు నాటి వాటి సంరక్షణ కోసం ట్రీ గార్డులు ఏర్పాటు చేశాను.నేడు అవి లక్షల సంఖ్యలో వృక్షాలుగా ఎదిగి ప్రాణవాయువును పంచుతున్నాయి.ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది" అని భావోద్వేగంగా తెలిపారు.నిస్వార్థ సేవకుడికి అవార్డు దక్కడంతో జిల్లా వ్యాప్తంగా పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, పర్యావరణ ప్రేమికులు వెంకన్నకు శుభాకాంక్షలు తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Latest News
20 Sep 2026 19:19:42
అభినందించిన కరాటే మాస్టర్స్
