నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల

Published On
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల

మధిర,ఆగస్టు,28: లోకల్ గైడ్
మధిర మండలం సిరిపురం గ్రామానికి చెందిన కొనకంచి ఫ్రాన్సిస్–మరియమ్మల కుమారుడు ప్రశాంత్ వివాహం తుళ్లూరు మండలానికి చెందిన ఈదులమూడి నాగరాజు ఏసుపాదం కుమార్తె ప్రసన్నతో సిరిపురం గ్రామంలోని ఆర్సీఎం చర్చిలో శుక్రవారం నాడు జరుగగా ఈ  వివాహ వేడుకల్లో బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్, మధిర అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి లింగాల కమల్‌రాజుతో కలిసి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి నూతన  వస్త్రాలను బహుకరించారు. అదే గ్రామం లో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు చావా వేణు నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమాల్లో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News