ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ, యూనిఫాం కుట్టు పనులను పరిశీలించిన 

అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి

Published On
ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ, యూనిఫాం కుట్టు పనులను పరిశీలించిన 

కామారెడ్డి జిల్లా, ఆగస్టు 28 లోకల్ గైడ్

మాచారెడ్డి మండలం లచ్చాపేట గ్రామంలో ఎస్‌ఐఆర్‌ హియరింగ్ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంలు అందేలా కుట్టు పనులు పూర్తి చేయాలిమాచారెడ్డి మండలం లచ్చాపేట గ్రామంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్.వై. గిరి శుక్రవారం పరిశీలించారు. ఎస్‌ఐఆర్‌ హియరింగ్ ప్రక్రియలో భాగంగా అందుతున్న దరఖాస్తులు, ధృవపత్రాల పరిశీలన, సంబంధిత రికార్డులను పరిశీలించారు.
అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లు కొనసాగకుండా నిబంధనల ప్రకారం పరిశీలన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. హియరింగ్‌కు హాజరయ్యే ఓటర్లకు అవసరమైన సమాచారం, సహకారం అందించాలని తెలిపారు.
అనంతరం లచ్చాపేట గ్రామంలో విద్యార్థుల యూనిఫాం కుట్టు పనులను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా యూనిఫాంలను నాణ్యతతో కుట్టాలని, నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్.వై. గిరి మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ప్రతి దశను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. యూనిఫాం కుట్టు పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ, విద్యార్థులకు సకాలంలో యూనిఫాంలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సరళ, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి..... అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి..... అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
గోదాముల స్థలాలను ముందుగానే గుర్తించి సిద్ధంగా ఉంచాలి* వానాకాలం ధాన్యం కొనుగోళ్ల సన్నాహకాలపై అధికారులతో సమీక్షించిన అదనపు కలెక్టర్
ప్రతిభ చాటిన వాకర్స్  సభ్యులకు ఘన సన్మానం
బహుజనుల హక్కుల కోసం పోరాడిన ధీరవనిత ఐలమ్మ. - ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలి.
మండలంలో 17 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక. విద్యార్థుల అభ్యున్నతి, పాఠశాలల అభివృద్ధిలో కృషికి గుర్తింపు
పేట జిల్లాను బాల కార్మికు లు,బాల్య వివాహాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి
గణనాథుడి రాకకు ఆమనగల్లు ముస్తాబు!
ఎస్ఐఆర్ ప్రక్రియ నోటీసులు, వివరాల నమోదు కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు.కలెక్టర్ స్నేహ శబరిష్