అంగన్వాడీ టీచర్ల (ఖాళీల) భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.       

Published On
అంగన్వాడీ టీచర్ల (ఖాళీల) భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.       

 

 రాజేంద్రనగర్,ఆగస్టు 30, (లోకల్ గైడ్ ):                  ఐసీడీయస్ శేరిలింగంపల్లి ప్రాజెక్టు పరిధిలోని పలు ప్రాంతాల్లో అంగన్వాడీ టీచర్ల ( ఖాళీలు ) భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు శేరిలింగంపల్లి ప్రాజెక్టు అధికారిణి ( సిడిపిఓ ) కవిత ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రాజెక్టు పరిధిలోని ఓల్డ్ శివరాంపల్లి, హైదర్ గూడ, భూపాల్ నగర్, గండిపేట మండలంలోని హైదర్ షాకోట్ -1,  బండ్లగూడ పి ఎన్ టి కాలనీలలో అంగన్వాడీ టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 
అర్హులైన  అభ్యర్థులు https://wdcw.tg.nic.in  వెబ్సైట్ ను సందర్శించవచ్చునన్నారు. దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో https://wdcw.tg.nic.in వెబ్ సైట్ ద్వారా మాత్రమే సమర్పించవలెనని సూచించారు. 
దరఖాస్తులను ఆగస్టు 31 2026 నుంచి  సెప్టెంబర్ 10వ తేదీ  సాయంత్రం 5.00 గంటలకు వరకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని ఆమె తెలిపారు.

Tags:

About The Author

Latest News

41వ చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు  కురవి మండలం కాంగ్రెస్ అధ్యక్షులు బాలగాని శ్రీనివాస్ గౌడ్  41వ చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు  కురవి మండలం కాంగ్రెస్ అధ్యక్షులు బాలగాని శ్రీనివాస్ గౌడ్ 
      లోకల్ గైడ్ సెప్టెంబర్ 10  కురవి  మహబూబాబాద్ జిల్లా కురవి మండలం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం గడీల పాలనకు
రైతు కూలీల ఐక్య పోరాటానికి ఖమ్మం పిలుపు
చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం: సర్పంచ్ బొప్పిడి గోపాల్
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు మేలు
చిట్యాల(చాకలి) ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
వాహనం అమ్మారా.. ఆర్టీఏ రికార్డుల్లో యాజమాన్య బదిలీ తప్పనిసరి!
తుక్కుగూడలో కేటీఆర్ ధర్నా కార్యక్రమానికి వెళుతున్న బి ఆర్ ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్.