- District News
- Warangal
- చిన్నారులు, నవజాత శిశువుల కోసం ప్రత్యేక వైద్య శిబిరం.
చిన్నారులు, నవజాత శిశువుల కోసం ప్రత్యేక వైద్య శిబిరం.
హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ వైద్యులు డాక్టర్ జి. ప్రవీణ్ కుమార్, డాక్టర్ శతాబ్ది గిరి...వెల్లడి
Published On
By Ram Reddy
హనుమకొండ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 18
(లోకల్ గైడ్ న్యూస్)
జి. ప్రవీణ్ కుమార్, కన్సల్టెంట్
నియోనాటాలజిస్ట్,
డాక్టర్ శతాబ్ది గిరి
కార్డియాలజిస్ట్
తెలిపారు. నవజాత శిశువులు, చిన్నారుల ఆరోగ్య సమస్యల నివారణార్థం ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను అందించనున్నట్లు వారు వెల్లడించారు. ఈ మేరకు హనుమకొండలోని యశోద క్లినిక్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలనువెల్లడించారు.
ఈ వైద్య శిబిరంలో హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్‌కు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు పాల్గొని వైద్య సలహాలు, సంప్రదింపులు అందించనున్నారు. ప్రతి నెల మూడవ గురువారం రోజున హనుమకొండ లో హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ వైద్యులు కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్, జి. ప్రవీణ్ కుమార్, కన్సల్టెంట్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్,
డాక్టర్ శతాబ్ది గిరి వైద్యులు అందుబాటులో ఉంటారు. ఈ క్రింది సెల్ నెంబర్లను
9618328673,
9247565105
సంప్రదించగలరని తెలిపారు. నవజాత శిశువుల సమస్యలు, నెలలు నిండకుండా పుట్టడం (ప్రీమెచ్యూరిటీ), పుట్టుకతో వచ్చే శ్వాసకోశ సమస్యలు, తక్కువ బరువుతో జన్మించిన శిశువుల సంరక్షణపై ప్రత్యేక వైద్య సలహాలు,
పిల్లల గుండె సంబంధిత సమస్యలు, చిన్నారుల్లో పుట్టుకతో వచ్చే గుండె లోపాలు, ఇతర కార్డియాక్ సమస్యల నిర్ధారణ, నిపుణులైన కార్డియాలజిస్ట్ చేత వైద్య సేవలు పొందవచ్చునని వారు తెలిపారు.
వరంగల్, హనుమకొండ పరిసర ప్రాంతాల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, తమ పిల్లల ఆరోగ్య భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సిబ్బంది వికె రెడ్డి, చంద్రకాంత్, మహేష్, విజయ్, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
30 Sep 2026 10:10:57
దుగ్గొండి, సెప్టెంబర్ 29(లోకల్ గైడ్):
రాబోయే కాలంలో ఎల్ నినో ప్రభావంతో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉందని, ముందస్తు ప్రణాళికతో నీటిని ఒడిసిపట్టాలని దుగ్గొండి...
