వరంగల్ ప్రజలకు నాణ్యమైన యూరాలజీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సేవలు

డాక్టర్ కౌశిక్ అమంచర్ల...వెల్లడి

Published On
వరంగల్ ప్రజలకు నాణ్యమైన యూరాలజీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సేవలు

హనుమకొండ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్22
(లోకల్ గైడ్ న్యూస్)

వరంగల్ ప్రజలకు నాణ్యమైన యూరాలజీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సేవలు,హైదరాబాద్‌కు వెళ్లే పనిలేకుండా స్థానికంగానే ప్రత్యేక వైద్య సలహాలు
అత్యాధునిక రోబోటిక్ సర్జరీతో వేగవంతమైన రికవరీ,హనుమకొండ, వరంగల్ ప్రాంత ప్రజలకు అధునాతన యూరాలజీ చికిత్సలు, అత్యాధునిక రోబోటిక్ శస్త్రచికిత్స సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ (సోమాజిగూడ) కన్సల్టెంట్ యూరాలజిస్ట్, రోబోటిక్ యూరో-ఆంకాలజిస్ట్ డాక్టర్ కౌశిక్ అమంచర్ల తెలిపారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కిడ్నీ, ప్రోస్టేట్, మూత్రాశయం, మూత్రనాళాల సమస్యలు, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు హైదరాబాద్ దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే నిపుణులైన వైద్యుల సలహాలు, ముందస్తు పరీక్షలు, ఫాలో-అప్ సేవలు అందించడమే ఈ ప్రత్యేక కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన వెల్లడించారు. యూరాలజికల్ క్యాన్సర్ల చికిత్సలో రోబోటిక్ సర్జరీ ఒక విప్లవాత్మక మార్పు అని డాక్టర్ కౌశిక్ తెలిపారు.
కిడ్నీ క్యాన్సర్: 'రోబోటిక్ పార్టియల్ నెఫ్రెక్టమీ' ద్వారా క్యాన్సర్ కణాలను మాత్రమే తొలగించి, ఆరోగ్యకరమైన కిడ్నీ భాగాన్ని కాపాడవచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్: 'రోబోటిక్ రాడికల్ ప్రొస్టటెక్టమీ' ద్వారా అతి తక్కువ రక్తస్రావంతో క్యాన్సర్‌ను తొలగించి, రోగి త్వరగా కోలుకునేలా చేయవచ్చు. సాధారణంగా కిడ్నీ మార్పిడి సర్జరీలు సవాలుతో కూడుకున్నవని, అయితే యశోద హాస్పిటల్స్‌లో 81 ఏళ్లు మరియు 71 ఏళ్ల వయస్సు గల జీవించి ఉన్న వృద్ధ దాతల నుంచి కూడా సేకరించి విజయవంతంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. సరైన ప్రీ-ఆపరేటివ్ పరీక్షలు, అనుభవజ్ఞులైన మల్టీడిసిప్లినరీ వైద్య బృందం సమన్వయంతో ఇది సాధ్యమైందని చెప్పారు.ముందస్తు గుర్తింపుతో ప్రాణరక్షణ
మినిమల్లీ ఇన్వేసివ్ (తక్కువ కోత) సర్జరీల వల్ల శస్త్రచికిత్స అనంతర నొప్పి తగ్గి, రోగులు త్వరగా సాధారణ జీవనానికి తిరిగొస్తారని వివరించారు. కిడ్నీ, ప్రోస్టేట్ క్యాన్సర్లను ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిస్థాయిలో నయం చేయవచ్చని, ప్రజల్లో యూరాలజికల్ వ్యాధులపై అవగాహన పెంచడమే తమ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ కార్పొరేట్ రిలేషన్స్ విభాగ ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

అనంతగిరి హిల్స్ రన్: విజేతలను సత్కరించిన బీజేపీ నాయకులు అనంతగిరి హిల్స్ రన్: విజేతలను సత్కరించిన బీజేపీ నాయకులు
        వికారాబాద్ (లోకల్ గైడ్) జిల్లా బ్యూరో : అనంతగిరి హిల్స్‌లోని హరిత రిసార్ట్‌లో 'అవంతిక కన్స్ట్రక్షన్స్' ఆధ్వర్యంలో నిర్వహించిన 5, 16, మరియు 32 కిలోమీటర్ల
ఖమ్మం ఫోటోగ్రాఫర్‌ ముత్యాల నాగేశ్వరరావుకు జాతీయ కీర్తి!
వికారాబాద్ జిల్లా కేంద్రం లో మాతా శిశు ఆసుపత్రి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని, కాంట్రాక్ట్ రద్దు చేయాలి: 
_మాదిగ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి
అక్టోబర్ 6న ఛలో హైదరాబాద్
సినీ దర్శకుడు శ్రీనివాసరావు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ కొండేటి మల్లయ్య. 
అక్టోబర్‌ 8న ఆర్టీసీ ఎక్స్‌ రోడ్‌  బస్ భవన్‌ ఎదుట ధర్నా పోస్టర్లు ఆవిష్కరణ దివ్యాంగులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించాలి