_కేజీ నుంచి పీజీ వరకు యోగ విద్యను పాఠ్యాంశంగా గుర్తించాలి

_జాతీయస్థాయి రౌండ్ టేబుల్ సమావేశానికి శ్రీకారం.. భవిష్యత్ తరాలకు బ్రహ్మజ్ఞాన యోగ విద్య అందించడమే లక్ష్యం

Published On
_కేజీ నుంచి పీజీ వరకు యోగ విద్యను పాఠ్యాంశంగా గుర్తించాలి

 

కుత్బుల్లాపూర్ అక్టోబర్ 09 (లోకల్ గైడ్ ప్రతినిధి)

యోగ విద్యను కేజీ నుంచి పీజీ వరకు విద్యా పాఠ్యాంశంగా ప్రవేశపెట్టడంతో పాటు ధ్యాన విద్య, బ్రహ్మవిద్య ప్రాధాన్యతను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పాలనే మహాసంకల్పంతో జాతీయస్థాయి రౌండ్ టేబుల్ సమాలోచన వేదికను ఏర్పాటు చేయనున్నట్లు సత్యం ట్రెడిషనల్ యోగ ఆశ్రమం నిర్వాహకులు తెలిపారు. శ్రీ జ్ఞానానంద గిరి మహారాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.మంచిర్యాల జిల్లా జన్నారం మండల పరిసర ప్రాంతాల్లోని ఆధ్యాత్మిక సాధకులతో పాటు తెలంగాణ రాష్ట్రం, దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు, యువత, విద్యార్థులు ఈ మహత్తర సంకల్పంలో భాగస్వాములుకావాలనినిర్వాహకులుపిలుపునిచ్చారు.భవిష్యత్ తరాలకు భారతీయ యోగ సంప్రదాయాల గొప్పతనాన్ని అందించడంతో పాటు యోగ, ధ్యాన విద్యలను శాస్త్రీయ పరిశోధనలతో అనుసంధానం చేయాలన్నదిఈవేదికప్రధానఉద్దేశమనిపేర్కొన్నారు.ఇందుకోసంవిశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో పరిశోధనలు చేపట్టి, యోగ విద్యకు విద్యా వ్యవస్థలో తగిన గుర్తింపు లభించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలనిసంకల్పించినట్లు తెలిపారు.యోగ విద్యతో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంయోగ విద్య ప్రతి విద్యార్థికి.. ధ్యాన విద్య ప్రతి మనసుకు.. బ్రహ్మవిద్య ప్రతి జీవితానికి..” అనే నినాదంతో యోగ విద్యను ప్రజలకు చేరువ చేయాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. యోగ, ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించడంతో పాటు భవిష్యత్తులో యోగ శిక్షకులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారు.సత్యం ట్రెడిషనల్ యోగ ఆశ్రమం ఆధ్వర్యంలో ధ్యాన విద్య, యోగ విద్య, బ్రహ్మవిద్య తరగతులను ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా సంప్రదాయ యోగ జ్ఞానాన్ని భావితరాలకు అందించడంతో పాటు ఆధ్యాత్మిక, విద్యా రంగాల్లో అవగాహన పెంపొందించాలనేది తమ ఆశయమని పేర్కొన్నారు.అక్టోబర్ 11న జాతీయస్థాయి సమాలోచన
ఈ నెల 11వ తేదీన ఆదివారం నవాబుపేట గ్రామంలోని సత్యం ట్రెడిషనల్ ఆశ్రమంలో జాతీయస్థాయి రౌండ్ టేబుల్ సమాలోచన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. యోగ విద్యాభివృద్ధి, బ్రహ్మజ్ఞాన ప్రచారం, విద్యా వ్యవస్థలో యోగకు గుర్తింపు, శాస్త్రీయ పరిశోధనల ప్రోత్సాహం వంటి అంశాలపై చర్చించనున్నట్లు వివరించారు.ఈ మహాసంకల్ప కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్తలు, యోగ సాధకులు, విద్యావేత్తలు, యువత, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆశ్రమ నిర్వాహకులువిజ్ఞప్తిచేశారు.కార్యక్రమవివరాలు:
తేదీ: 11-10-2026వేదిక: సత్యం ట్రెడిషనల్ యోగ ఆశ్రమం, నవాబుపేట గ్రామం, అంబర్‌పేట పోస్ట్, కడెం మండలం, నిర్మల్ జిల్లా.సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:
9915576619, 9550389992, 8985155738.
ప్రజలందరికీ ఆహ్వానం: యోగ విద్య, ధ్యాన విద్య, బ్రహ్మవిద్య అభివృద్ధి కోసం చేపడుతున్న ఈ జాతీయస్థాయి మహాసంకల్పంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరారు.

Tags:

About The Author

Latest News

గాదెపాడు గ్రామంలోని యాదవ బజారు వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి! గాదెపాడు గ్రామంలోని యాదవ బజారు వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!
        కారేపల్లి, అక్టోబర్ 18 (లోకల్ గైడ్ న్యూస్): ఖమ్మం జిల్లా గాదెపాడు గ్రామపంచాయతీ పరిధిలోని యాదవ బజారు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను
గేట్ కారేపల్లి సద్దుల బతుకమ్మ వేడుకల్లో తోటకూరి పిచ్చయ్య దాతృత్వం!
వికారాబాద్ ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
షాద్ నగర్ బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు
రావిర్యాల లో వైభవంగా దుర్గాష్టమి ఉత్సవాలు.
కారేపల్లిలో ఎల్‌నినోపై అలర్ట్‌.. పొదుపు చర్యలకు సర్పంచుల సిద్ధం! రంజిత్ కుమార్ 
బతుకమ్మ ఆడపడుచులకు చీరల కానుక.. గుడిపూడి తిరుమల రావు ఆప్యాయత!