దగాకోరు ఆరోపణలతో ప్రజలను మభ్యపెట్టలేవ్..!  

దమ్ముంటే ఆధారాలతో రండి.!! ---- ఎమ్మెల్యే పై బురద జల్లితే బీఆర్‌ఎస్‌ నేతల గతాన్ని ప్రజల ముందుంచుతాం.

3 ఎకరాలు కొన్నట్లు చూపించి 13 ఎకరాలు కబ్జా చేసింది మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి  వదిన గారే .. ---- మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పై మండి పడ్డ   కాంగ్రేస్ నాయకులు. 
Published On
దగాకోరు ఆరోపణలతో ప్రజలను మభ్యపెట్టలేవ్..!  

వనపర్తి లోకల్ గైడ్ ప్రతినిధి సెప్టెంబర్ 3:

దగాకోరు ఆరోపణలతో ప్రజలను మభ్యపెట్టలేవని,  
దమ్ముంటే ఆధారాలతో రావాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై కాంగ్రేస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. గురువారం జిల్లా కాంగ్రేస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటుచేసిన విలేకరుల  సమావేశం లో  కాంగ్రేస్ పార్టీ నాయకులు శంకర్ నాయక్, కోళ్ల వెంకటేష్, వాల్యనాయక్, కొమ్ము వెంకట స్వామిలు మాట్లాడుతూ ఎమ్మెల్యే మేఘారెడ్డి  పై బురద జల్లితే బీఆర్ఎస్‌ నేతల గతాన్ని ప్రజల ముందుంచుతామన్నారు .3 ఎకరాలు కొన్నట్లు చూపించి 13 ఎకరాలు కబ్జా చేసింది మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి  వదిన గారు కదా అని వారు ప్రశ్నించారు. రూ. 1కోటి 13 లక్షలు గవర్నమెంట్ టాక్స్ ఎగ్గొట్టింది సాక్షాత్తు మాజీ మంత్రి గారే కదా అన్నారు. 
కుమ్మరి నాగన్నకు గిఫ్ట్ డిడి ఎలా చేస్తారు... కుమ్మరి నాగన్న మీ బంధువా, మీ దయాదులా ...గిఫ్ట్ డిడి చేసేందుకు వాళ్లకు మీకు ఏం బంధుత్వ సంబంధం ఉందా అని వారు ప్రశ్నించారు. పెయిడ్ బ్యాచ్ తో  మా ఎమ్మెల్యే  పై ఫిర్యాదు చేసినంత మాత్రాన అవాస్తవాలు వాస్తవాలు కాకుండా పోతాయన్నారు. 
మాజీ మంత్రి  ఆత్మ అయిన మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి గారే ఎమ్మెల్యే గారి భూమి కొనుగోలు, విక్రయాలలో  ప్రధాన భూమిక పోషించారని వారు గుర్తు చేశారు. పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామ శివారులో 39 కుంటల భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే  రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటూ బీ ఆర్ ఎస్ నాయకు లు చేసిన తప్పుడు ఆరోపణలు, తప్పుడు ఫిర్యాదులపై   వెల్టూరు గ్రామ ప్రజలు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్న భూమికి సంబంధించిన వ్యక్తులు వాస్తవాలను వారు వెల్లడించారు.  రఘుపతి రెడ్డి గారే ప్రధాన భూమిక పోషించి కొనుగోలు విక్రయాలు చేయించిన ఈ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా ఉంటే నిరుపేదలైన రైతులకు చేస్తానని  ఎమ్మెల్యే  మీడియా  మీడియా ముందు  చెప్పారన్నారు. రాజకీయ లబ్ధి కోసం కొందరిపై ఒత్తిడి తెచ్చి జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేసినంత మాత్రాన అవాస్తవాలు వాస్తవాలు కావని, ఇలాంటి నిందారోపణలు మానుకొని 
మీరు కబ్జా చేసిన కుమ్మరి వాండ్ల మాన్యాన్ని వారికి వెంటనే అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. 
ఈ కార్యక్రమంలో  వనపర్తి మండల అధ్యక్షుడు రవికిరణ్ యాదవ్, పెబ్బేరు మండల కాంగ్రెస్ నాయకులు గంధం రంజిత్ కుమార్,సర్పంచులు రవి నాయక్, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహేష్, సురేష్ నాయక్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పేదల పొట్టపై ధరల పోటు.. ఉపాధి హామీ బలోపేతం చేయాలి పేదల పొట్టపై ధరల పోటు.. ఉపాధి హామీ బలోపేతం చేయాలి
        కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 17 (లోకల్ గైడ్ న్యూస్) : నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతూ పేదల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, ధరల
బియ్యంతో శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో గణనాథుడి ప్రతిష్ట 
అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తెలంగాణ… రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
కిలారి సుశీలకు నివాళి
చిరుమర్రి చెరువు వద్ద రూ. 2.90 కోట్లతో పర్యాటక వసతుల అభివృద్ధి
సెప్టెంబర్‌ 17.. పోరాట చరిత్రకు మైలురాయి
ప్రభుత్వ, వైద్య కళాశాల సీట్లు సాధించిన పూర్వ విద్యార్థులకు ఘన సన్మానం