- District News
- వైఎస్సార్ సంక్షేమ పథకాలు చిరస్మరణీయం.
వైఎస్సార్ సంక్షేమ పథకాలు చిరస్మరణీయం.
వైఎస్సార్ బాటలో ప్రజా పాలన నడుస్తోంది. - డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ జాధవ్.
లోకల్ గైడ్/తాండూర్:
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయని డిసిసి అధ్యక్షులు దారాసింగ్ జాదవ్ తెలిపారు. బుధవారం పెద్దేముల్ మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి, డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి వేడుకలను గ్రామ కమిటీ అధ్యక్షుడు సాయిలు అధ్యక్షతన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ జాధవ్ హాజరయ్యారు. అనంతరం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ జాదవ్, పలువురు నాయకులు మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేశారని తెలిపారు. రేషన్ బియ్యం, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, గుండె ఆపరేషన్లకు వైద్య సహాయం, పింఛన్లు తదితర అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి పేదల జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు.
వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయని ధారాసింగ్ అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పాలన సాగిస్తోందని తెలిపారు. వైఎస్సార్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను మరింత విస్తృతంగా ప్రజలకు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా మాటలకే పరిమితమైందని విమర్శించారు. కొంతమంది పని పాట లేని వ్యక్తులు అక్కడక్కడ దుష్ప్రచారాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ప్రజల ఆశీర్వాదంతో మరోసారి ఎన్నికల బరిలోకి వెళ్లి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి నసీర్, గ్రామ కమిటీ అధ్యక్షుడు సాయిలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లారెడ్డి, ప్రవీణ్ కుమార్, ఆనందచారి, రియాజ్, రవిశంకర్, గోపాలకృష్ణ, పెంటప్ప, రాజు, డివై నరసింహులు, విద్యాసాగర్, శ్రీనివాస్ రెడ్డి, వార్డు మెంబర్ మల్లప్ప, షబ్బీర్, ఫయాజ్, నహీం, ఇక్బాల్, సాయిబాబా, కార్యకర్తలు రహీం, మేరాజ్, మినహాజ్, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
