ఆకులతో ఆరోగ్యం!

ఆకులతో ఆరోగ్యం!

ఆయుర్వేదంలో నేరేడుకి ప్రత్యేక స్థానం ఉంది. పండ్లే కాదు, దీని ఆకులు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వివిధ ఔషధ గుణాలతో నిండిన నేరేడు ఆకులు, అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయని చెబుతున్నారు.నేరేడు ఆకులను నమిలితే నోటి ఆరోగ్యం మెరుగవుతుంది. నోటిలోని బ్యాక్టీరియా నశించి, దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు బలంగా మారుతాయి.వీటిలోని ఆయుర్వేదిక సమ్మేళనాలు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. నేరేడు ఆకుల కషాయం తాగితే విరేచన సమస్యలు తగ్గుతాయి. కాలేయం పనితీరు మెరుగవుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్‌, అజీర్తి వంటి సమస్యలు తగ్గిపోతాయి.నేరేడు ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించి, షుగర్‌ లెవల్స్‌ను తగ్గిస్తాయి. దాంతో మధుమేహాన్ని అదుపులో ఉంచే అవకాశముంటుంది. భోజనానికి ముందు ఒక టీ స్పూన్‌ నేరేడు ఆకుల రసాన్ని తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.అలాగే, నేరేడు ఆకుల రసంలో కొద్దిగా ధనియాలను కలిపి తాగితే జ్వరం తగ్గే అవకాశం ఉంది.

Tags:

About The Author

Advertisement

Latest News