ఓటర్ల ప్రత్యేక సమగ్ర వేగవంతంచేయాలి 

Published On
ఓటర్ల ప్రత్యేక సమగ్ర వేగవంతంచేయాలి 

 

లోకల్ గైడ్, వికారాబాద్ :

ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ విచారణ ప్రక్రియను వేగవంతం  చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటాచారి తెలిపారు.
సోమవారం తెలంగాణ రాష్ట్ర  ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో 
ఫిర్యాదులు, అభ్యంతరాలు నిర్దిష్ట గడువులో విచారణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జిల్లాలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై రాష్ట్ర  ఎన్నికల అధికారికి వివరిస్తూ...జిల్లాలో ఇప్పటి వరకు 55 శాతం విచారణ నోటీస్ లు జారీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో  267872 అనామలీస్ ఓటర్లను గుర్తించగా 147738 ఓటర్లకు నోటీసులో జారీ చేయడం జరిగిందని, ఇంకా  120134 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయవలసి ఉందని ఆయన తెలిపారు. మూడు రోజుల్లోగా పూర్తి నోటీసులను జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని  తెలిపారు.విచారణ సందర్భంగా ప్రతి ఒక్కరి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి అప్లోడ్ చేయడం జరుగుతుందని అదనపు కలెక్టర్ సీఈఓ కు వివరించారు.

Tags:

About The Author

Latest News

కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలి. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలి.
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ తాతా మధు దూషించడం సరికాదని ఫరూక్‌నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయికల్...
దళితులంటే బిఆర్ఎస్ పార్టీకి అంత చిన్న చూపా*? దళితుల జోలికి వస్తే ఖబడ్దార్ : ,
మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించాలి.
పోలీస్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సట్టు సైదులు.
జనగణన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి 
గణేష్ ఉత్సవాల్లో డిజే లకు అనుమతి లేదు.        
ఫిరంగినాలపై అక్రమ నిర్మా ణాలు.......