మందమర్రి తాహసిల్దార్ పై హత్యాయత్నం..

ప్రముఖ నాయకుడితో పాటు ఇద్దరిపై అనుమానాలు..

Published On
మందమర్రి తాహసిల్దార్ పై హత్యాయత్నం..

 

 

 

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

 

 

మంచిర్యాల జిల్లా మందమర్రి తహసీల్దార్ సతీష్‌కుమార్ శర్మపై హత్యాయత్నానికి పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.తనకు ప్రాణహాని కలిగించేలా కొందరు వ్యవహరించారంటు తహసీల్దార్ రామకృష్ణాపూర్ పోలీసులను ఆశ్రయించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.ఈ పరిణామం రెవెన్యూ,పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.తాహసిల్దార్ శనివారం తన విధులు ముగించుకొని ఇంటికి వెళుతన్న క్రమంలో ఆయన వాహనాన్ని వెంబడించారని,అదేవిధంగా రామకృష్ణాపూర్ లోని ఆయన ఇంటి వద్ద తెల్లవారుజామున 3.30 సమయంలో కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు సంచరించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ అంశంలో ముఖ్యంగా మందమర్రికి చెందిన ఓ ప్రముఖ రాజకీయ పార్టీ నాయకుడితో పాటు మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అయితే ఈ అనుమానాలు,ఆరోపణలు దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉంది.తనకు ఎదురైన పరిణామాలపై తహసీల్దార్ ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లిన అనంతరం పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.ఒక ప్రభుత్వ అధికారి తనకు ప్రాణహాని ఉందంటు పోలీసులను ఆశ్రయించడం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది.తహసీల్దార్‌పై హత్యాయత్నం జరిగిందన్న ఆరోపణల వెనుక అసలు కారణమేంటి,ఈ వ్యవహారంలో రాజకీయ కోణం ఉందా,లేక అధికారిక విధుల నిర్వహణకు సంబంధించిన వివాదమే కారణమా అనే ప్రశ్నలు ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి.ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తుల పాత్ర ఎంతవరకు ఉంది అనే అంశం పోలీసుల సమగ్ర దర్యాప్తులో తేలాల్సి ఉంది.ఈ వ్యవహారంలో ఫిర్యాదు,సంఘటనకు సంబంధించిన పరిస్థితులు,ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు,అందుబాటులో ఉన్న సిసి కెమెరా దృశ్యాలు,కాల్‌ డేటా వివరాలు తదితర అంశాలను పోలీసులు పరిశీలిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందినే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ప్రభుత్వ అధికారిపై ప్రాణహని ఆరోపణలు రావడంతో పోలీసులు ఈ కేసును చాలెంజింగ్ గా తీసుకొని అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

About The Author

Latest News