- District News
- ఈషా హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించాలి
ఈషా హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించాలి
అనంతగిరి బస్సు ప్రమాద బాధితులకు ఉచిత మెరుగైన వైద్యం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు - క్షతగాత్రులను పరామర్శించిన రాష్ట్ర ఐటీ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు

వికారాబాద్ అనంతగిరి గుట్ట సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాద బాధితులకు ఈషా హాస్పిటల్ మరియు మెడిక్యూర్ హాస్పిటల్స్ ప్రత్యేక చొరవతో మెరుగైన ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాయి. వికారాబాద్ జిల్లా ఆస్పత్రితో పాటు ఈషా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర సమాచార సాంకేతిక (ఐటీ ) శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించారు.
బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి, క్షతగాత్రులకు ఎటువంటి లోటు రాకుండా ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన వైద్యం అందించాలని ఈషా ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఎమ్మెల్యేలు బుయ్యాని మనోహర్ రెడ్డి, కాలే యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య, వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డితో పాటు డాక్టర్ భరత్ రెడ్డి, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ సుస్మిత రెడ్డి, డాక్టర్ అభినవ్, డాక్టర్ స్మిత ఈషా హాస్పిటల్ యాజమాన్యం రత్నారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకట్ రామ్ రెడ్డి ఇషా హాస్పటల్ సిబ్బంది పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
