క్రమశిక్షణతో కూడిన విద్య అవసరం

కెనరా బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ కుర్సం ఎర్రయ్య

Published On
క్రమశిక్షణతో కూడిన విద్య అవసరం

 

 

చర్ల : లోకల్ గైడ్ న్యూస్ :
క్రమశిక్షణతో కూడిన విద్యతోనే విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని కెనరా బ్యాంక్ విశ్రాంత మేనేజర్ కుర్సం ఎర్రయ్య అన్నారు. చర్లలోని ఆయిల్ బంక్ ఏరియాకు చెందిన విశ్రాంత విలేజ్ డెవలప్‌మెంట్ అధికారి, కీర్తిశేషులు సోయం భద్రయ్య జ్ఞాపకార్థం ఆయన మనుమడు, ఖమ్మంలోని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ కుర్సం రవితేజ కొమరం భీం విద్యార్థి నిలయానికి క్వింటా బియ్యాన్ని, విద్యార్థులకు ఒకపూట భోజనాన్ని వితరణగా అందించారు. నిలయ కమిటీ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కుర్సం ఎర్రయ్య మాట్లాడుతూ.. ఆదివాసీ విద్యార్థుల అభ్యున్నతి కోసం వసతిగృహాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. మారుమూల అటవీ ప్రాంత గ్రామాలకు చెందిన ఆదివాసీ విద్యార్థులకు వసతి, విద్యా సౌకర్యాలు కల్పిస్తూ వారిని అన్ని రంగాల్లో ఉత్తములుగా తీర్చిదిద్దేందుకు నిలయ కమిటీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. విద్యార్థుల్లో కనిపిస్తున్న క్రమశిక్షణతో పాటు సంస్కృత శ్లోకాలు పాడుతున్న తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. నిలయ కమిటీ సభ్యులు విద్యార్థులను తమ సొంత పిల్లలుగా భావించి వారి అభివృద్ధికి కృషి చేయడం సంతోషకరమన్నారు. విద్యార్థులు తమకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని పట్టుదలతో చదవాలని సూచించారు. “మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. పట్టుదల, క్రమశిక్షణతో చదివితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు” అని ఎర్రయ్య అన్నారు. విద్యార్థులు ఉన్నతంగా ఎదిగి తమ తల్లిదండ్రులతో పాటు విద్యార్థి నిలయానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వితరణ అందించిన కుర్సం రవితేజను నిలయ కమిటీ సభ్యులు అభినందించారు. విద్యార్థుల అవసరాలకు తమ వంతు సహకారం అందించేందుకు దాతలు ముందుకు రావాలని నిర్వాహకులు కోరారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం ఐటీడీఏ రిటైర్డ్ అసిస్టెంట్ మానిటరింగ్ అధికారి భద్రయ్య కుటుంబ సభ్యులు తెల్లం రమణయ్య, చింత మంగారావు, సోడి సుబ్బారావు, సీనియర్ జర్నలిస్ట్ గడ్డం మణికుమార్, కొమరం భీం, శబరి నిలయ ప్రముఖులు సంతోష్, వరలక్ష్మి, తోలెం రామకృష్ణ, కూడం ఉంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం
ఖమ్మం,ఆగస్టు,30: లోకల్ గైడ్:ఖమ్మం : వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం నగర మాజీ...
తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ హాస్పిటల్లో నర్స్ దారుణ హత్య. 
మణికొండలో వాక్ విత్ హైడ్రా ర్యాలీ 
మిషనరీ చర్చి భూములను పరిరక్షించాలి.
శిరీష మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి
బోటనీ అధ్యాపకుడి కోసం దరఖాస్తుల ఆహ్వానం.
ప్రజలతో మమేకమైన పోలీసింగ్