ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా

Published On
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా

IMG-20260825-WA0173ఆదిలాబాద్ లోకల్ గైడ్ ఆగస్టు

విద్యా రంగం అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మంగళవారం స్థానిక బొక్కల్‌గూడ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూషతో కలిసి ఆయన నూతన అదనపు తరగతి గదులను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. 

అనంతరం కళాశాల ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో కలిసి కలెక్టర్ మొక్కలను నాటి నీరు పోశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఫలితాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా జిల్లా అకడమిక్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసి, తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అత్యధికంగా 1,200 మంది విద్యార్థులతో నాలుగు మీడియాలలో విద్యాబోధన సాగుతున్న ఈ కళాశాల జిల్లాకే తలమానికమని కొనియాడారు. అసంపూర్తిగా ఉన్న మొదటి అంతస్తులోని నాలుగు నూతన గదులను ఖర్చుకు వెనుకాడకుండా పూర్తి చేసి నేడు ప్రారంభించడం ఎంతో సంతోషకరమన్నారు.
విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కళాశాలలోనే ఉండి ప్రతి సబ్జెక్టును క్షుణ్ణంగా అభ్యసించాలని సూచించారు. తరగతులకు క్రమం తప్పకుండా హాజరైతేనే సబ్జెక్టులపై పూర్తి పట్టు లభిస్తుందని, తద్వారానే ఉజ్వల భవిష్యత్తు సాధ్యపడుతుందని స్పష్టం చేశారు. అలాగే, కళాశాలలో అందుబాటులో ఉన్న ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (IFP) ద్వారా నీట్, ఎంసెట్ వంటి ఉన్నత స్థాయి పోటీ పరీక్షలకు అవసరమైన డిజిటల్ కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ర్యాంకులు సాధించి, కళాశాలకు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ, విద్యతోనే భవిష్యత్ ఉందని, అధ్యాపకులను గౌరవించి సలహాలు సూచనలు పాటించాలని అన్నారు. ప్రతి ఒక్కరు ఒక్కో మొక్క చొప్పున నాటి సమీక్షించాలని అన్నారు.

అనంతరం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమంటో లను కలెక్టర్, అతిథులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, డీఐఈవో గణేష్ జాదవ్, డీఎంబ్ల్యూవో కలీం, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, వివిధ వార్డుల కౌన్సిలర్లు సుచిక, సుష్మా, సంజయ్, జీవన్, ఇతర అధికారులు, అధ్యాపకులు,  విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి. సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి.
సిద్దిపేట, సెప్టెంబర్ 07(లోకల్ గైడ్): సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ పవన్ మృతి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని బహుజన లెఫ్ట్ పార్టీ (బీఎల్‌పీ) సిద్దిపేట...
ఇది ప్రజాస్వామ్యమా రాక్షస రాజ్యమా?
ఎస్‌జీఎఫ్‌ పోటీల్లో ఐపీఎస్‌ విద్యార్థుల ప్రతిభ
జర్నలిస్టులపై కలెక్టర్ నిర్లక్ష్యం తగదు ఫీజు రాయితీ జీవో వెంటనే విడుదల చేయాలి
నాడు ఫ్రెండ్లీ పోలీసు... నేడు రేవంత్ పోలీసు
రైతు కుటుంబానికి స్థిరమై న ఆదాయం కల్పించేలా ప్రణాళికలురూపొందించాలి
కనీస వేతనాల సలహా మండలి లో జాతీయ సంఘాలను చేర్చాలి