- District News
- దేశ అభివృద్ధిలో యువతే కీలకం.
దేశ అభివృద్ధిలో యువతే కీలకం.
దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే - డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలి.
లోకల్ గైడ్/తాండూర్:
దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని తిరంగా అభియాన్ కమిటీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. బుదవారం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, పెద్దేముల్ మండల కేంద్రంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భారత్ మాతాకీ జై, వందేమాతరం అనే నినాదంతో ముందుకెళ్తూ దేశభక్తిని చాటారు.ఈ సందర్భంగా నిర్వాహకులు పలువురు మాట్లాడుతూ.. యువత తమ శక్తి, సామర్థ్యాలను దేశ ప్రగతికి వినియోగించాలని సూచించారు. విద్య, సాంకేతికత, సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
అదేవిధంగా డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.కాగా డ్రగ్స్ వద్దు–జీవితం ముద్దు” అనే నినాదంతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దేముల్ గ్రామ ఉప సర్పంచ్ డివై ప్రసాద్, బిజెపి అధ్యక్షుడు వీరేశం,జై బీమ్ అధ్యక్షుడు బాలరాజ్, సందీప్, యాదయ్య గౌడ్, పరిపూర్ణ చారి,కిరణ్, అశోక్ ,మండలంలోని వివిధ గ్రామాల యువత, విద్యార్థులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
