ఆప్త మిత్రుని కుటుంబానికి పూర్వవిద్యార్థుల ఆపన్న హస్తం

Published On
ఆప్త మిత్రుని కుటుంబానికి పూర్వవిద్యార్థుల ఆపన్న హస్తం


నారాయణపేట, ఆగస్టు 10
చిన్ననాటి స్నేహం.. ఒకే తరగతి గదిలో చదువుకు న్న అనుబంధం.. కాలం గడిచినా చెదరని ఆత్మీయ త.. ఆపద సమయంలో ఆ స్నేహబంధం మరోసారి వెలుగుచూసింది. తమతో కలిసి చదువుకున్న బాల్య మిత్రుడు అనారోగ్యంతో మృతి చెందడంతో అతడి కుటుంబాన్ని ఆదుకునేం దుకు పూర్వ విద్యార్థులం తా ఒక్కటై మానవత్వాన్ని చాటుకున్నారు. నారాయ ణపేట జిల్లాలోని నారా యణపేట మండలం జాజా పూర్ గ్రామానికి చెందిన జీరీ ప్రకాష్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడు తూ గత వారం రోజుల క్రితం మృతి చెందాడు. ప్రకాష్ మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న ఆయన చిన్న నాటి మిత్రులు, పూర్వ విద్యార్థులు సోమవారం జాజాపూర్ గ్రామానికి చేరు కుని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శిం చారు.ఈ సందర్భంగా ప్రకాష్‌తో తమకున్న చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తుచే సుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం పూర్వ విద్యార్థులంతా కలిసి తమ వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా నిలుస్తామని, ఎలాంటి అవసరం వచ్చినా తమకు తెలియజేయాలని కుటుంబ సభ్యులకు భరో సా కల్పించారు.స్నేహం అంటే సంతోషాల్లోనే కాదు.. కష్టాల్లోనూ తోడుగా నిలవడమేనని పూర్వ విద్యార్థులు తమ చర్య ద్వారా చాటిచెప్పారు. ఆపదలో ఉన్న మిత్రుడి కుటుంబానికి ఆర్థికంగా, మానసికంగా అండగా నిలిచిన పూర్వ విద్యార్థు లను గ్రామస్థులు అభినం దించారు.
ఫోటో రైట్ అప్:7.ఆర్థిక సహాయం అందించిన పూర్వ విద్యార్థులు 
___________________

Tags:

About The Author

Latest News

రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత శిక్షణ తరగతులు రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత శిక్షణ తరగతులు
    మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)   పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తుల చేసుకున్న నిరుద్యోగ యువతకు మంచిర్యాల పట్టణంలోని వెంకటేశ్వర్లు థియేటర్ చౌరస్తా వద్ద ఉన్న టీటీడీ
సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
సిద్దిపేటలో ‘కేసీఆర్ ఉచిత శిక్షణా శిబిరం’..
తీజ్ పండుగ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి 
ఒక ఇంచు భూమి కూడా పోనివ్వను - తీన్మార్ మల్లన్న. 
సర్దార్ మియాను పరామర్శించిన మాజీ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి .