ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి 

వర్షాలు కురవాలని సాగర్ లో అధికారికంగా వరుణ యాగం 

ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు  - 108 మంది రుత్వికులు అర్చకులతో వరుణ యాగం.
Published On
ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి 

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్ :

దేశ, రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, మంచి వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్ వద్ద కృష్ణా నది ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన వరుణ యాగం ప్రశాంతంగా ముగిసింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నలుమూలల నుండి వచ్చిన 108 మంది రుత్వికులు, అర్చకుల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 4 గంటల 5 నిమిషాలకు రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి  దంపతుల చేతుల మీదుగా వరుణ యాగం ప్రారంభమైంది. ఈ వరుణ యాగం సోమవారం సాయంత్రం 3 గంటల 24 నిమిషాలకు పూర్ణాహుతి తో ముగిసింది. ఋత్వికులు, అర్చకులు  గోపూజతో యాగాన్ని ప్రారంభించి, యాగ ప్రదక్షిణము, పుణ్యా వచనం, అంకురార్పణం,ఋష్యశృంగ పూజ, తదితర పూజలతో వేదమంత్రాల మధ్య సాగిన వరుణయాగం వర్షాలు సమృద్ధిగా కురవాలని నిర్వహించడం జరిగింది. కృష్ణా నది ఒడ్డునIMG-20260810-WA0251 చతుర్విధ పారాయణం తో నిర్వహించిన ఈ యాగం లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి దంపతులు పూర్ణాహుతి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దంపతులకు పూర్ణకుంభంతో, యాగశాల వద్దకు మేళా తాళాల తో ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి దంపతులు  వరుణ యాగం లో పాల్గొని పూర్ణాహుతి గావించి యాగాన్ని  ముగించారు. అంతకుముందు సాగర్ చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి  బిసి సంక్షేమ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ లు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఈ వరుణ యాగంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి  ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ,రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, ప్రభుత్వ విప్ బ
బీర్ల ఐలయ్య, విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం,  శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు శంకర్ నాయక్, రాష్ట్ర  డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్త అమిత్ రెడ్డి ,ప్రభుత్వ సలహాదారులు కే. కేశవ రావు, సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి జనా రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ బి.చంద్ర శేఖర్,ఎస్ పి శరత్ చంద్ర పవార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, నాగార్జున సాగర్ ఎంఎల్ఏ కుందూరు జయవీర్ రెడ్డి, శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మందుల సామేలు, బత్తుల లక్ష్మారెడ్డి, బాలునాయక్, కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు,  పలువురు ప్రజాప్రతినిధులు, మిర్యాలగూడ ఆర్ డి ఓ రమణా రెడ్డి, జిల్లా అధికారులు,తదితరులు 
పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News