- District News
- ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యవర్గ సమావేశం...
ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యవర్గ సమావేశం...
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
మంచిర్యాల జిల్లాలోని రా అండ్ బాయిల్డ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో జిల్లా అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు అధ్యక్షతన మంగళవారం సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నేటివరకు ఎన్నికలు కాని పట్టణ,మండల ఆర్యవైశ్య సంఘాల ఎన్నికలను నిర్వహించాలని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అదనపు ప్రధాన కార్యదర్శి ముక్తా శ్రీనివాస్,మహాసభ ప్రత్యేక సలహాదారు నలుమాసు కాంతయ్యలు సూచించారు.ఈ మేరకు బెల్లంపల్లి డివిజన్లోని పట్టణ మండలాల ఎన్నికల నిర్వహించడానికి జిల్లా మాజీ అధ్యక్షుడు రేణికుంట్ల శ్రీనివాస్ ను కన్వీనర్ గా,జిల్లా కోశాధికారి కౌటారం సత్యనారాయణ,ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు విద్యాసాగర్,ప్రధాన కార్యదర్శి పాత భాస్కర్,కోశాధికారి మంచాల రత్నాకర్,యువజన విభాగం అధ్యక్షులు బాల సంతోష్ లను నియమించారు.నెల రోజులలో బెల్లంపల్లి డివిజన్లోని మండలాలు,పట్టణాల్లో ఎన్నికలు నిర్వహిస్తు సభ్యత్వాలు సైతం పెంపొందించడానికి కృషి చేయాలని ఆదేశించారు.
