మృతుల కుటుంబాలకు పరామర్శ.. బాధితులకు భరోసా: బక్కి వెంకటయ్య

Published On
మృతుల కుటుంబాలకు పరామర్శ.. బాధితులకు భరోసా: బక్కి వెంకటయ్య

దుబ్బాక, ఆగస్టు 10(లోకల్ గైడ్):

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సోమవారం దుబ్బాక నియోజకవర్గంలోని పెద్దచీకోడ్, భూంపల్లి గ్రామాల్లో పర్యటించి మృతుల కుటుంబాలను పరామర్శించారు. అలాగే అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించి ధైర్యం చెప్పారు.పెద్దచీకోడ్ గ్రామానికి చెందిన జర్నలిస్టు కుంభాల రవీందర్ తల్లి కుంభాల రాజవ్వ మృతి చెందడంతో ఆయన నివాసానికి చేరుకున్న బక్కి వెంకటయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజవ్వ కుటుంబం కోసం ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని అండగా నిలిచారని, ఆమె మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. రాజవ్వ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఆకాంక్షించారు.అనంతరం భూంపల్లి గ్రామానికి చెందిన ఉసికె బాగవ్వ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులను బక్కి వెంకటయ్య పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాగవ్వ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.అదే గ్రామానికి చెందిన భీమ్‌రావు వరికోస్‌ వీన్స్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న చైర్మన్ వెంకటయ్య ఆయనను పరామర్శించారు. వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా చికిత్స తీసుకుంటూ ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమాల్లో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పరశ దేవరాజు, కన్వీనర్ గుర్రాల శ్రీనివాస్, సర్పంచ్ జన్నారెడ్డి, వార్డు సభ్యులు కొండల్, కనకయ్య, మాజీ సర్పంచులు తౌడ శ్రీనివాస్, కరికే భాస్కర్, మాజీ ఎంపీటీసీ లచ్చమ్మగారి రాంరెడ్డి, జర్నలిస్టులు బండ నర్సింలు, కుంభాల రవీందర్‌తో పాటు బొంగురపు బాల్రెడ్డి, పర్వతాలు, కృష్ణమరాజు, బొంగారం వెంకట్‌రెడ్డి, కమ్మరి శ్రీనివాస్, వనం కనకయ్య, మాడ అశోక్, అలుగుల ప్రకాష్, బండ రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News