- District News
- విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పెంపొందించాలి
విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పెంపొందించాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పెంపొందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.సోమవారం జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్,జిల్లా విద్యాశాఖ అధికారి పి చందయ్యతో కలిసి కాంప్లెక్స్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,మండల విద్యాధికారులు,సిఆర్ పి లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతు ప్రభుత్వం విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తు అన్ని ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు.తల్లితండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ విద్యాసంస్థలపై నమ్మకంతో ప్రభుత్వ పాఠశాలలలో చేరుస్తున్నారని తెలిపారు.జిల్లాలో సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రతి రోజు అల్పాహారం అందించడంతో ప్రభుత్వ పాఠశాలలలో హాజరు శాతం తప్పకుండా పెరుగుతుందని తెలిపారు.పిల్లలు అభ్యాసన సామర్ధ్యం పెంచే బాధ్యత విద్యాధికారులు,ఉపాధ్యాయులదే అని,త్వరలో జిల్లాలో విద్యార్థుల హాజరు,నేర్చుకునే సామర్థ్యం తదితర అంశాలతో యాప్ ఏర్పాటు చేసి వారాంతపు నివేదికలు సేకరించనున్నట్లు తెలిపారు.విద్యార్థులకు మల్టీ గ్రేడ్,మల్టీ లెవెల్ టీచింగ్ అమలు చేయాలని,మండల విద్యాధికారులు,కాంప్లెక్స్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తరచు పాఠశాలను సందర్శించి విద్యార్థుల పోటీతత్వం ఆధారంగా తరగతుల విభజన,సీటింగ్ పొజిషన్ సక్రమంగా చేయాలని తెలిపారు.పాఠశాల సందర్శన సమయంలో విద్యార్థులతో మాట్లాడాలని,సంబంధిత ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థులలో అభ్యాసన సామర్ధ్యాలు పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు.సరైన టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ ద్వారా ఎఫ్ఎల్ఎన్ శాతాన్ని పెంపొందించాలని తెలిపారు.విద్యార్థులను నిశితంగా పరిశీలించడం,ఉపాధ్యాయులతో విద్యార్థులు సామర్థ్యాల గురించి సమీక్షించడం,తరగతుల ప్రణాళిక పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు.సంబంధిత కాంప్లెక్స్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మమండల విద్యాధికారులు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ పై అవగాహన కలిగి ఉండాలని,పాఠశాలలను తరచు సందర్శించాలని తెలిపారు.మౌలిక వసతుల కల్పనలో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వెంటనే తెలియజేయాలని,అవసరం మేరకు వసతులు కల్పించనున్నట్లు తెలిపారు.విద్యార్థుల పఠన శక్తిని వృద్ధి చేసి నేర్చుకునే సామర్థ్యం పెంపొందించాలని తెలిపారు.
