మానవతా సేవలో...కాంగ్రెస్ నాయకుడు గుడిపూడి తిరుమలరావు

సర్పంచ్ ఉమా నరేష్ విన్నపంతో నిరుపేద కుటుంబానికి కింటా బియ్యం వితరణ

Published On
మానవతా సేవలో...కాంగ్రెస్ నాయకుడు గుడిపూడి తిరుమలరావు

 

 

కారేపల్లి , అక్టోబర్ 2 (లోకల్ గైడ్ న్యూస్):

మాదారం గ్రామపంచాయతీ పరిధిలోని నిరుపేద కుటుంబానికి చెందిన మూడు లక్ష్మ అకాల మరణంతో విషాదంలో ఉన్న కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు గుడిపూడి తిరుమలరావు అండగా నిలిచారు. కుటుంబ పరిస్థితిని సర్పంచ్ అజ్మీరా ఉమా నరేష్ ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన గుడిపూడి తిరుమలరావు, ఆదివారం నిర్వహించనున్న దశదిన కార్యక్రమాల కోసం కింటా బియ్యాన్ని అందించారు. ఆపద సమయంలో స్పందించి నిరుపేద కుటుంబానికి చేయూతనందించిన గుడిపూడి తిరుమలరావుకు సర్పంచ్ అజ్మీరా ఉమా నరేష్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సంక్షేమం పట్ల స్పందిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న గుడిపూడి తిరుమలరావు మరింత మందికి అండగా నిలవాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాదారం సర్పంచ్ అజ్మీరా ఉమా నరేష్, కాంగ్రెస్ నాయకుడు గుడిపూడి తిరుమలరావు, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ధరావత్ వినోద్, జిల్లా కార్యదర్శి కిలారి అప్పారావు, మాదారం నాలుగో వార్డు ఇన్‌చార్జి కసాని లక్ష్మీనారాయణ, వార్డు సభ్యులు అజ్మీరా రజిని, అజ్మీరా బాలాజీ, అజ్మీరా శారద, వంకుడోత్ భారతి, అజ్మీరా మోతీలాల్, పోతనబోయిన రవి, బట్టు నరసయ్య, రమేష్, అజ్మీరా సునీత, మూడు మురళి, బానోతు భాస్కర్, జయ, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మానవతా సేవలో...కాంగ్రెస్ నాయకుడు గుడిపూడి తిరుమలరావు మానవతా సేవలో...కాంగ్రెస్ నాయకుడు గుడిపూడి తిరుమలరావు
        కారేపల్లి , అక్టోబర్ 2 (లోకల్ గైడ్ న్యూస్): మాదారం గ్రామపంచాయతీ పరిధిలోని నిరుపేద కుటుంబానికి చెందిన మూడు లక్ష్మ అకాల మరణంతో విషాదంలో ఉన్న
ఎన్కతల లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ఫోన్ మోజులో వైద్యుల నిర్లక్ష్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పసిపాపల ప్రాణాలతో చెలగాటం
ఆమనగల్లు అభివృద్ధి కోసం ఆచారి ఆమరణ నిరాహార దీక్ష
విద్యార్థులకు సరిపడా బస్సు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు
ఫతుల్లాగూడ జంతు సంరక్షణ కేంద్రంలో కమిషనర్‌ పరిశీలన ఏబీసీ, యాంటీ రేబిస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలపై సమీక్ష
దళితుల,అభ్యున్నతి,సామాజిక రాజకీయ ,చైతన్యం కాంగ్రెస్ తోనే సాధ్యం.... షాద్ నగర్ నియోజక వర్గంలో ఎస్సీ, ఎస్టీలకు సముచిత స్థానం...