అభివృద్ధినీ చూసి ఓర్వలేకే విమర్శలు!.

ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి చొరవతో రూ.1.15 కోట్లతో అభివృద్ధి పనులు.

బీఆర్‌ఎస్ నేతల విమర్శలు రాజకీయ ఉనికి కోసం చేస్తున్నవే - గ్రామ కమిటీ అధ్యక్షుడు యాదయ్య.
Published On
అభివృద్ధినీ చూసి ఓర్వలేకే విమర్శలు!.

లోకల్ గైడ్ /తాండూర్
మంబాపూర్ గ్రామ అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు యాదయ్య, ఉపాధ్యక్షుడు జి.రాములు మండిపడ్డారు. ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ... ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో గత రెండున్నరేళ్లలో మంబాపూర్‌లో సుమారు రూ.1.15 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు తదితర మౌలిక వసతుల పనులు చేపట్టినట్లు తెలిపారు.
గ్రామంలోని పలు వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులతో పాటు తాగునీటి కోసం బోర్ మోటార్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ నూతన భవనానికి రూ.20 లక్షలు, డ్వాక్రా భవనానికి రూ.10 లక్షలు, పాఠశాలలో సైన్స్ గదికి రూ.21 లక్షలు, ప్రహరీ గోడకు రూ.3 లక్షలు మంజూరైనట్లు వెల్లడించారు.
తాండూర్ నియోజకవర్గంలో మంబాపూర్‌కు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించి తొలి విడతలోనే 328 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించారని, 150 కొత్త రేషన్ కార్డులు, 84 మందికి ఆత్మీయ భరోసా కింద రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం అందినట్లు తెలిపారు.ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు కళ్లకు కనిపిస్తలేవా అని ప్రశ్నించారు. కేవలం కుట్రతోనే గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి బీఆర్‌ఎస్ నాయకులకు కంటగింపుగా మారిందని, తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే వారు విమర్శలకు దిగుతున్నారని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. గ్రామ ప్రజలు అన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఖలీల్, మాజీ సర్పంచ్‌లు నారాయణ, శ్రవణ్, శ్రీనివాస్, ఇబ్రహీం, పాండు, అంజి, యేసు, విజయ్‌కుమార్, చెన్నారం శ్యామ్, కుమ్మరి నర్సిములు, తెర్వతి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News