సరైన శ్రద్ధ లేకనే పగుళ్లు

అభివృద్ధి పనుల నాణ్యతపై గత పాలకులకు శ్రద్ధ లేదు - కమిషన్లపైనే ఎక్కువ దృష్టి పెట్టారూ.

ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి 
Published On
సరైన శ్రద్ధ లేకనే పగుళ్లు

లోకల్ గైడ్/తాండూర్:

కాగ్నా నదిపై నిర్మించిన వంతెనకు పగుళ్లు ఏర్పడటానికి గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం కాగ్నా నదిపై ఏర్పడిన పగుళ్లను స్థానిక నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల నాణ్యత, నిర్మాణ ప్రమాణాలపై సరైన శ్రద్ధ చూపకుండా కమిషన్లపైనే ఎక్కువ దృష్టి పెట్టారని ఆరోపించారు. కాగ్నా నదిపై నిర్మించిన వంతెనకు ఏడాది వ్యవధిలోనే రెండుసార్లు పగుళ్లు ఏర్పడటం గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు. వంతెనకు అవసరమైన మరమ్మతులు చేపట్టడంతో పాటు నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాలపై సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి, సొసైటీ మాజీ డైరెక్టర్ మల్లేశం, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News