- District News
- Warangal
- మద్యం సేవించి వాహనం నడపవద్దు
మద్యం సేవించి వాహనం నడపవద్దు
సురక్షితంగా ప్రయాణించండి, ప్రాణాలను కాపాడుకోండి
ట్రాఫిక్ ఎసిపి సత్యనారయణ... వెల్లడి
Published On
By Ram Reddy
హనుమకొండ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్21
(లోకల్ గైడ్ న్యూస్)
రోడ్డు ప్రమాదాలను నివారించడం, ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన కల్పించడం మద్యం సేవించి వాహనాలు నడపకుండా ప్రజలను చైతన్యపరచడం కోసం హన్మకొండ పోలీస్ హెడ్ క్వార్టర్ లో నెలకొల్పబడిన ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్(టిటిఐ) లో ట్రాఫిక్ ఎసిపి టి.సత్యనారయణ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన సుమారు 150 మంది వాహనదారులకు కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన వారికి మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాలు, ప్రాణనష్టం, చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించారు. మద్యం సేవించిన అనంతరం వాహనం నడపకుండా, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల డ్రైవర్‌తో పాటు ఇతర వాహనదారులు, ప్రయాణికులు, పాదచారుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని పోలీసులు తెలిపారు. వాహనదారులు బాధ్యతాయుతంగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని, మైనర్ లను వాహనాలు నడుపుటకు అనుమతించవద్దని, ఒకవేళ మైనర్ లు వాహనం నడిపి పోలీసులకు పట్టుబడినట్లైతే వాహన యజమానులపై చట్టపరమైన చర్యలుంటాయని, “మద్యం సేవించి వాహనం నడపవద్దు – సురక్షితంగా ప్రయాణించండి, ప్రాణాలను కాపాడుకోండి” అని వాహణదారులను ఎసిపి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమమలో RSI నవీన్ కుమార్ SI వేణుగోపాల్ రెడ్డి , మహిళా కానిస్టేబుల్ అరుణ ,మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన వారు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
04 Oct 2026 20:18:10
వికారాబాద్ (లోకల్ గైడ్) జిల్లా బ్యూరో :
అనంతగిరి హిల్స్‌లోని హరిత రిసార్ట్‌లో 'అవంతిక కన్స్ట్రక్షన్స్' ఆధ్వర్యంలో నిర్వహించిన 5, 16, మరియు 32 కిలోమీటర్ల
