- District News
- సంగారెడ్డిలో ఘనంగా మన్నె సంఘం బోనాల ఉత్సవాలు హాజరైన చింతా సాయినాథ్
సంగారెడ్డిలో ఘనంగా మన్నె సంఘం బోనాల ఉత్సవాలు హాజరైన చింతా సాయినాథ్
సంగారెడ్డి పట్టణంలో మన్నె సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోనాల ఉత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తనయుడు చింత సాయినాథ్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఐబీ నుంచి అస్తబల్ వరకు బోనాల ఊరేగింపు వైభవంగా కొనసాగింది. ఊరేగింపులో మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాలు సమర్పించారు. డప్పు చప్పుళ్లు, నృత్యాలతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. చింత సాయినాథ్ చిందులు వేస్తూ సందడి చేశారు.ఈ సందర్భంగా చింత సాయినాథ్ మాట్లాడుతూ, బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీకాంత్ నాని, నారాయణ, వెంకటేశం, మన్నె సంఘం నాయకులు, మహిళలు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
