వాజేడు,లొకల్ గైడ్ ప్రతినిధి :
కర్రెగుట్టల ప్రాంతాన్ని మావోయిస్టు రహిత ప్రాంతంగా ప్రకటించిన డీజీపీ ఆనంద్ తెలిపారు. సోమవారం నాడు ములుగు జిల్లా వెంకటాపురం సర్కిల్ పరిధిలో గల పామునూరు సిఆర్పిఎఫ్ బేస్ క్యాంపను ఆయన సందర్శించారు. పామునూరు నుండి సత్తిస్గడ్ వరకు చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు అనంతరం కర్రగుట్టలో పోలీసు జెండాను ఎగరవేసి శాంతికి చిహ్నంగా పావురాలను ఎగరవేశారు. సుమారు 50-60 ఏళ్ల గా మావోయిస్టు ప్రభల్యం ప్రాంతంగా ఉన్న కర్రగుట్టలో మావోయిస్టుల ఏరివేత అనంతరం ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలో నెలకొందని డీజీపీ సివి ఆనంద్ పేర్కొన్నారు. పామునూరు బేస్ క్యాంపు నుంచి సత్తిష్ ఘడ్ వరకు రహదారి నిర్మాణ పనులు మంజూరు అయ్యాయని వాటిని త్వరత గతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని ప్రజా రవాణాకు అనుకూలంగా తీర్చిదిద్దుకోవడంతోపాటు పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.పూర్తయిన రహదారి చివరి భాగం వరకు వెళ్లి పనులను ఆయన పరిశీలించారు. పామునూరులో నివసిస్తున్న గ్రామస్తులకు డిజిపి ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు, దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు ఆదివాసి గ్రామాల ప్రజలకు పోలీసు శాఖ తరపున పూర్తిస్థాయి సహాయము సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు. ఇంకా మావోయిస్టు కార్యకర్తల్లో ఉన్నవారు ఎక్కడ ఉన్నా పోలీసులు ఎదుట లొంగిపోవాలని డిజిపి పిలుపునిచ్చారు లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరఫున పునరావాసం అవసరమైన సహాయాన్ని అందిస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ ఐజి ములుగు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ అటు విశాఖ ఉన్నతాధికారులు సిఆర్పి ఎఫ్ అధికారులు జిల్లా పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.