సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 3వ జాతీయ లోక్‌అదాలత్ నిర్వహణ

Published On
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 3వ జాతీయ లోక్‌అదాలత్ నిర్వహణ

 


 లోకల్ గైడ్ /సంగారెడ్డి :

సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 3వ జాతీయ లోక్‌అదాలత్‌ను 12-09-2026న సంగారెడ్డి జిల్లా కోర్టుతో పాటు జహీరాబాద్, జోగిపేట, నారాయణఖేడ్ మరియు జిన్నారం కోర్టు ప్రాంగణాల్లో నిర్వహించనున్నట్లు  సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి,  సెషన్స్ జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్ శ్రీమతి జి. భవానీ చంద్ర తెలిపారు.
జాతీయ లోక్‌అదాలత్ ద్వారా వివిధ రకాల సివిల్, క్రిమినల్, చెక్ బౌన్స్, మోటార్ వాహన ప్రమాద పరిహార కేసులు, కుటుంబ వివాదాలు, బ్యాంకింగ్ మరియు ఇతర రాజీ పడదగిన కేసులను ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు ఇరుపక్షాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుందని, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్యను తగ్గించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని  న్యాయమూర్తి పేర్కొన్నారు.
12 సెప్టెంబర్ 2026న నిర్వహించనున్న 3వ జాతీయ లోక్‌అదాలత్‌లో అత్యధిక సంఖ్యలో కేసులను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని న్యాయాధికారులు, న్యాయవాదులు, పోలీసు అధికారులు మరియు సంబంధిత శాఖల అధికారులను కోరారు. పెండింగ్ కేసులతో పాటు ప్రీ-లిటిగేషన్ దశలో ఉన్న వివాదాలను కూడా పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునేందుకు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రజలు తమ కేసుల పరిష్కారం కోసం సంబంధిత కోర్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ/తాలూకా న్యాయ సేవా కమిటీను సంప్రదించి లోక్‌అదాలత్ ద్వారా పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలని   జి. భవానీ చంద్ర  పిలుపునిచ్చారు.

రాజీ మార్గమే ఉత్తమ మార్గం  లోక్‌అదాలత్ ద్వారా త్వరితగతిన న్యాయం

అనే లక్ష్యంతో 3వ జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయడానికి అన్ని వర్గాలు సహకరించాలని ఆమె కోరారు.

Tags:

About The Author

Latest News

శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం,గుండ్లగడ్డ కిష్టబావి అన్న ప్రసాదవితరణ   శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం,గుండ్లగడ్డ కిష్టబావి అన్న ప్రసాదవితరణ  
          జనగామ పట్టణంలో గుండ్లగడ్డ కిష్టబావి 9వ రోజు గణేష్  నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, అన్నప్రసాద వితరణ   కార్యక్రమానికి దాత:- మెట్టు సురేష్,వందన, దుబ్బాక బాలయ్య, పద్మ,
క్రషర్‌ నిలిపివేయాలంటూ  నిరాహార దీక్షలు
విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం
భైంసాలో ఘనంగా ప్రారంభమైన గణేష్ నిమజ్జనోత్సవం
ఎన్ఎస్ఎస్ఆధ్వర్యంలో ప్రభుత్వజూనియర్ కళాశాల మధిర ఏక్ పెడ్ మాకే నామ్ 2వరోజుప్రోగ్రాం
భాజపా టీచర్స్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా డా. నెల్లూరి బెనర్జీ
నరసన్న పల్లి పాఠశాలలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పరిశీలించిన