క్విట్ ఇండియా ఉద్యమ ప్రేరణతో లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా ఉద్యమించాలి

పల్లా దేవేందర్ రెడ్డి ఏఐటీయూసీ కార్యదర్శి పిలుపు.

Published On
క్విట్ ఇండియా ఉద్యమ ప్రేరణతో లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా ఉద్యమించాలి
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్.
 
 
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తి తో లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా ఉద్యమించాలనీ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు నూనె రామస్వామి పిలుపు ఇచ్చారు. జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు నేడు దేవరకొండలో నిరసన కార్యక్రమం చేయటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి 44 కార్మిక చట్టాలను సాధించుకుంటే 13 సంవత్సరాల క్రితం అధికారానికి వచ్చిన బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకు 47 కోట్ల కార్మికులకు నష్టం జరిగే విధంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ లని తెచ్చారని అన్నారు.
దేశంలో 90శాతం  కార్మికవర్గానికి సామాజిక భద్రత లేకపోవటమే కాక, వారికి కనీస జీవన ప్రమాణాలను కూడా దూరం చేస్తూ సామాజిక భద్రత ప్రయోజనాలను రద్దు చేశారు . క్విట్ ఇండియా ప్రేరణతో కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని క్విట్ బిజెపి నినాదంతో పోరాడాలని కోరారు.కేంద్ర ప్రభుత్వం తన మొండివైఖరి తో కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలలో భాగంగా కార్మిక చట్టాలను, రైతు చట్టాలను రద్దు చేయకుండా, రైతుల, కార్మిక హక్కులను కాలరాస్తుంది. కార్మికులు యూనియన్‌గా ఏర్పడటం, 8 గంటల పనిదినం, పని ప్రదేశంలో సామాజిక భద్రత, సమ్మె చేసే హక్కు, బేరసారాలడే హక్కులను బిజెపి ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా అనిచివేస్తుంది. 
విద్యుత్ సవరణ బిల్లు 2025ను వెనక్కు తీసుకోవాలని విద్యుత్ ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష ధోరణితో నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నదని, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం విబిజి రామ్ జీ చట్టాన్ని తెచ్చి గ్రామాలలో పనిచేస్తున్న వారికి చెల్లించే కూలీ రేట్లను, పని దినాలను పెంచి అమలు చేయాలని  డిమాండ్ చేసారు.
కొత్త పెన్షన్ చట్టాన్ని రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం ప్రజా, రైతు, కార్మిక, దేశవ్యతిరేక విధానాలతో కార్పొరేట్ శక్తులకు, ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరించే విధానాన్ని తీవ్రంగా ఖండించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పల్లా రంగా రెడ్డి, ఏఐటీయూసీ మండల కార్యదర్శి అలమోని మల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మొగుళ్ళ వెంగలయ్య,మండల కార్యదర్శి కిన్నెర బారీములు, చంద్రయ్య, మహేష్,సైదులు దేవీలాల్, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
Tags:

About The Author

Latest News

రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత శిక్షణ తరగతులు రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత శిక్షణ తరగతులు
    మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)   పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తుల చేసుకున్న నిరుద్యోగ యువతకు మంచిర్యాల పట్టణంలోని వెంకటేశ్వర్లు థియేటర్ చౌరస్తా వద్ద ఉన్న టీటీడీ
సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
సిద్దిపేటలో ‘కేసీఆర్ ఉచిత శిక్షణా శిబిరం’..
తీజ్ పండుగ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి 
ఒక ఇంచు భూమి కూడా పోనివ్వను - తీన్మార్ మల్లన్న. 
సర్దార్ మియాను పరామర్శించిన మాజీ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి .