కోశాధికారి నరసింహారావును   అభినందించిన పోలీస్ కమిషనర్..

Published On
కోశాధికారి నరసింహారావును   అభినందించిన పోలీస్ కమిషనర్..


ఖమ్మం,ఆగస్టు11: లోకల్ గైడ్:
ఖమ్మం పోలీస్ అసోసియేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, నూతన కార్యవర్గంగా ఎన్నికైన పోలీసు అధికారులకు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్  అభినందించారు. ఈ సందర్భంగా తల్లాడ మండలం నారాయణపురం  గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ తడికమళ్ల నరసింహారావు కోశాధికారిగా ఎన్నికల కావడం పట్ల ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.  మంగళవారం పోలీస్ కమిషనర్ ని  ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూపోలీస్ శాఖ గౌరవాన్ని మరింత పెంచేలా వ్యవహరించాలని, పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేసేలా తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారని ఆకాంక్షిస్తున్నామన్నారు.

Tags:

About The Author

Latest News