క్విట్‌ ఇండియా స్ఫూర్తితో జైల్‌ భరో విజయవంతం

కార్పొరేట్‌ అనుకూల విధానాలను తిప్పికొట్టాలి

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు రద్దు చేయాలి.. రైతు, కార్మికుల హక్కులు కాపాడాలి
Published On
క్విట్‌ ఇండియా స్ఫూర్తితో జైల్‌ భరో విజయవంతం

 



ఖమ్మం జిల్లా, కారేపల్లి (సింగరేణి ) : లోకల్ గైడ్, ఆగస్టు 10 : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం కారేపల్లి మండల కేంద్రంలో క్విట్‌ ఇండియా స్ఫూర్తితో జైల్‌ భరో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసించారు.

వ్యవసాయ రంగాన్ని స్వదేశీ, విదేశీ కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించేలా చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని, రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర నాయకులు భూక్య శివ నాయక్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా, రైతులు, కార్మికులు, సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా అమలు చేస్తున్న విధానాల వల్ల దేశంలో పేదరికం, ఆర్థిక అసమానతలు మరింత పెరుగుతున్నాయని అన్నారు.

రైతుల రుణాలను పూర్తిస్థాయిలో మాఫీ చేయడంతో పాటు కొత్త పంట రుణాలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కల్పించాలని, పంటల బీమాను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు.

ఉద్యోగ నియామక క్యాలెండర్‌ ప్రకటించాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువత సమస్యలను పరిష్కరించేందుకు తక్షణమే ఉద్యోగ నియామక క్యాలెండర్‌ను ప్రకటించాలని భూక్య శివ నాయక్ డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.
అదేవిధంగా విద్యుత్‌ సవరణ చట్టం–2025ను రద్దు చేయాలని, విత్తన చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, రైతులకు నష్టం కలిగించే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

క్విట్‌ ఇండియా స్ఫూర్తితో కార్పొరేట్‌ విధానాలపై పోరాటం

1942లో బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా సాగిన క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో నేడు కార్పొరేట్‌ సంస్థల ఆధిపత్యానికి వ్యతిరేకంగా రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, విద్యార్థులు, యువత ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని భూక్య శివ నాయక్ అన్నారు.
దేశ సంపదను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికుల జీవించే హక్కులను కాపాడేందుకు ప్రభుత్వాలు ప్రజా అనుకూల విధానాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
క్విట్‌ ఇండియా ఉద్యమానికి 84 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 10న నిర్వహించిన జైల్‌ భరో కార్యక్రమంలో ప్రజలు, రైతులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, పీడీఎస్‌యూ, ప్రగతిశీల యువజన సంఘం నాయకులు కార్తీక్, దినేష్, ప్రకాష్, అభిరామ్, కళ్యాణ్, ప్రసాద్, నాగేష్, పాపారావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు. గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు.
లోకల్ గైడ్/ తాండూర్ గంజాయి అక్రమ విక్రయాలు, రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పెద్దేముల్ ఎస్సై ఎం. ప్రశాంత్ వర్ధన్ హెచ్చరించారు. ఆదివారం గంజాయి...
పాముకాటుతో మహిళ మృతి.
బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు సెప్టెంబర్ 9 చివరి గడువు..
అత్తా పూర్ లో ఘనంగా కావడి యాత్ర.
తక్కువ ఖర్చుతో ప్రైవేట్ ఆసుపత్రులు పేదలకు మెరుగైన సేవలందించాలి 
శ్రావణ శోభలో ముత్యాలమ్మ బోనాలు