- District News
- గిరిజన పట్టభద్రులకు బీఈడీ ప్రవేశ దరఖాస్తుల గడువు పొడిగింపు
గిరిజన పట్టభద్రులకు బీఈడీ ప్రవేశ దరఖాస్తుల గడువు పొడిగింపు
Published On
By Ram Reddy
ఏజెన్సీ ప్రాంత గిరిజన పట్టభద్రులకు బీఈడీ కోర్సులో ప్రవేశం కల్పించేందుకు దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తెలిపారు 2026–28 విద్యా సంవత్సరానికి భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక గిరిజన బీఈడీ కళాశాలలో 28వ బ్యాచ్‌లో రెండు సంవత్సరాల రెగ్యులర్ బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం ఏజెన్సీ షెడ్యూల్డ్ ప్రాంతాలకు చెందిన గిరిజన పట్టభద్రుల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కళాశాలలో మొత్తం 100 సీట్లు ఉన్నాయని, తెలంగాణకు చెందిన ఏజెన్సీ షెడ్యూల్డ్ ప్రాంత గిరిజన అభ్యర్థులు మాత్రమే ప్రవేశానికి అర్హులని తెలిపారు. డిగ్రీలో కనీసం 40 శాతం మార్కులు సాధించి ఉండాలని, సంబంధిత డిగ్రీ పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మహిళలకు ప్రత్యేక కేటగిరీలో సీట్లు రిజర్వు చేసినట్లు వెల్లడించారు. ప్రాస్పెక్టస్, దరఖాస్తులను ఏటూరునాగారం, ఉట్నూర్, మన్ననూరు ఐటీడీఏ కార్యాలయాలతో పాటు భద్రాచలంలోని గిరిజన బీఈడీ కళాశాలలో ఉచితంగా పొందవచ్చని తెలిపారు. అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 25వ తేదీలోగా సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 8247528404, 8247798370, 9912272959, 9959575539 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఐటీడీఏ పీవో బి. రాహుల్ కోరారు.
Tags:
About The Author
Related Posts
Latest News
02 Sep 2026 07:32:17
కారేపల్లి (సింగరేణి) : లోకల్ గైడ్ న్యూస్, సెప్టెంబర్ 1:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చేవిటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఊకే
