విద్యకు ప్రాధాన్యతనిస్తు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు కృషి 

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ 

Published On
విద్యకు ప్రాధాన్యతనిస్తు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు కృషి 

 

 


IMG-20260831-WA0195

 

ప్రభుత్వం విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను డిసిపి ఎ భాస్కర్,జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య,మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్,మేయర్ ధర్ని మధుకర్,డిప్యూటీ మేయర్ సల్ల రమ్య,సింగరేణి సంస్థ అధికారులు బుద్ధ ప్రకాష్,రాధాకృష్ణ,హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులు సత్య చంద్ర దాస్,కాంతయ్యదాస్,వ్యవసాయ కమిటీ చైర్మన్ భానేష్,కార్పొరేటర్లు చిలువేరు జ్యోతి,శేరు శ్రీలక్ష్మి లతో కలిసి ప్రారంభించి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు.అనంతరం పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతు ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తు నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలలో బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రవేశపెట్టి,విద్యార్థులకు అల్పాహారం అందించి ఏకాగ్రతతో విద్యను అభ్యసించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమించి నాణ్యమైన విద్యా బోధన అందిస్తుందని,ప్రీ ప్రైమరీ పాఠశాల నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు అల్పాహారం,మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు తెలిపారు.సామాజిక బాధ్యతలో భాగంగా సింగరేణి సంస్థ 8కోట్ల రూపాయల సిఎంఆర్ నిధులను అందించడం అభినందనీయమని తెలిపారు.జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో ఈ విద్యా సంవత్సరం 7శాతం విద్యార్థుల నమోదు పెరిగిందని,ప్రైవేట్ పాఠశాలల నుండి దాదాపు 4వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలలో చేరారని,వచ్చే విద్యా సంవత్సరంలో మరింత పెంపొందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.మంచిర్యాల శాసనసభ్యులు మాట్లాడుతు కొడంగల్,మధిర,మంథని తరువాత మంచిర్యాలలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు.హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ కిచెన్ నిర్వహణ బాధ్యతలు చేపట్టి జగిత్యాల,మంచిర్యాల,పెద్దపల్లి జిల్లాల్లోని17మండలాల పరిధిలో 691ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 42వేల 450మంది విద్యార్థులకు,13ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో చదువుతున్న 6వేల 654మంది విద్యార్థులకు ప్రతిరోజు నాణ్యమైన,పరిశుభ్రమైన,పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించడం జరుగుతుందని తెలిపారు.హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ అమలు భాగస్వామిగా వ్యవహరిస్తుండగా,సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల ద్వారా కిచెన్ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు.ప్రభుత్వం కేటాయించిన సుమారు12వేల చదరపు అడుగుల షెడ్‌లో ఈ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినట్లు,ఆహార నాణ్యత,పరిశుభ్రత,భద్రతా ప్రమాణాలను అత్యున్నత స్థాయిలో నిర్వహించేందుకు ఫుడ్ ల్యాబ్,మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్,ఆర్ఓ వాటర్ ప్లాంట్,బాయిలర్ ప్లాంట్,సెంట్రల్ గ్యాస్ బ్యాంక్,ఆటోమేటిక్ వెజిటబుల్ వాషింగ్ అండ్ కటింగ్ యూనిట్ వంటి ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల,బెల్లంపల్లి,జన్నారం,మందమర్రి,లక్సెట్టిపేట,దండేపల్లి,కాసిపేట,నెన్నెల,హాజీపూర్,నస్పూర్,భీమారం మండలాలు,జగిత్యాల జిల్లాలోని వెల్లటూరు,ఎండపల్లి మండలాలు,పెద్దపల్లి జిల్లాలోని రామగుండం,పెద్దపల్లి,అంతర్గాం,పాలకుర్తి మండలాలలోని ప్రభుత్వ పాఠశాలలకు,జూనియర్ కళాశాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.విద్యార్థులు ఉదయం పూట ఆకలితో పాఠశాలలు,జూనియర్ కళాశాలలకు వెళ్లకుండా ఆరోగ్యకరమైన,పోషకాహారంతో కూడిన అల్పాహారం తీసుకుని ఉత్సాహంగా విద్యను అభ్యసించేలా చేయడం స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాం ప్రధాన లక్ష్యమని తెలిపారు.విద్యార్థుల నమోదులో మంచిర్యాల రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచిందని ప్రథమ స్థానంలో నిలిచే విధంగా కృషి చేస్తామని తెలిపారు.లక్షెట్టిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల,ప్రభుత్వ జూనియర్ కళాశాలలు రాష్ట్రంలోని అత్యున్నతంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.విద్యారంగ అభివృద్ధిపై దాదాపు 27వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని,ఈ చర్యలతో ప్రభుత్వ విద్యా సంస్థలపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని తెలిపారు.ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని,ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టినట్లు,జిల్లా కేంద్రంలో కార్పొరేట్ స్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.జిల్లాలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.అదేవిధంగా మంచిర్యాల శాసనసభ్యులు మాట్లాడుతు మంచిర్యాల జిల్లాలో చారిత్రాత్మకమైన ఘట్టాలు చోటు చేసుకున్నాయని,ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం అందించేందుకు సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించడం శుభప్రదం అని,గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేసేందుకు భూమి పూజ చేసినట్లు తెలిపారు.మంచిర్యాలలో రాష్ట్రంలో ప్రధమంగా శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.ఏర్పాట్లకు12కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని,జిల్లాలోని మిగతా ఘాట్లకు16కోట్ల 70లక్షల రూపాయలు,గూడెంలో పుష్కర ఘాట్ ఏర్పాటుకు 9కోట్ల 50లక్షల రూపాయలు,58కోట్ల రూపాయలతో గూడెంలోని సత్యనారాయణ స్వామి ఆలయం,మంచిర్యాలలోని విశ్వనాథ ఆలయం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తు త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.పుష్కర స్నానానికి వచ్చే భక్తులకు మూత్రశాలలు,బట్టలు మార్చుకునే గదులు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.దాదాపు 20లక్షల నుండి 25లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.పోలీస్,మున్సిపాలిటీ,వైద్య ఆరోగ్య శాఖల అధికారులు,సంబంధిత శాఖల అధికారులు తమకు కేటాయించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని తెలిపారు.అనంతరం హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధి మాట్లాడుతు సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ద్వారా ఈ ప్రాంతంలో దాదాపు 50వేల మంది విద్యార్థులకు ప్రతి ఉదయం సకాలంలో వేడిగా అల్పాహారం అందించేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ 
తో కలిసి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.కిచెన్‌లో ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ స్టీమర్లతో గంటకు 5వేల 400ఇడ్లీలు,ఆటోమేటిక్ దోశ మెషీన్‌తో గంటకు 2వేల దోశలు,ఆటోమేటిక్ పూరీ మెషీన్‌తో గంటకు 3వేల పూరీలు,సాంబార్,కూరల తయారీ యూనిట్ల ద్వారా 2గంటలలో 5వేల మంది విద్యార్థులకు సరిపడా ఆహారం,రైస్ కుకింగ్ పరికరాల ద్వారా కేవలం15నిమిషాలలో 1వేయి మందికి సరిపడా అన్నం తయారు చేసే సామర్థ్యం ఉందని తెలిపారు.అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తు ప్రతిరోజు వేలాది మంది విద్యార్థులకు అల్పాహారం అందించడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం,పోషకాహారం,ఏకాగ్రత,విద్యాభ్యాసంపై సానుకూల ప్రభావం చూపుతుందని తెలిపారు.రాష్ట్రంలో దాదాపుగా 4లక్షల మంది విద్యార్థులకు అందించనున్నామని,ఇందులో సుమారు 20శాతం సింగరేణి సంస్థ నిధులు సమకూర్చినట్లు తెలిపారు.భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించేందుకు ఫౌండేషన్ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మాట్లాడుతు ప్రభుత్వం విద్య,వైద్య రంగాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తుందని తెలిపారు.అనంతరం మంచిర్యాల పట్టణంలోని గోదావరి తీరంలో పుష్కర ఘాట్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు.గోదావరి పుష్కరాలు 2027లో భాగంగా జిల్లాలోని మంచిర్యాల పట్టణంలో పుష్కర ఘాట్,గూడెం శ్రీసత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధి,రహదారుల విస్తరణ పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.టైర్ 2లో లక్షెట్టిపేటలో పుష్కర ఘాట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించామని,ఏర్పాట్లకు అవసరమైన నిధులు సమకూర్చడం జరుగుతుందని తెలిపారు.జిల్లాలోని పుష్కర ఘాట్ల వద్ద సుమారు 6లక్షల మంది భక్తులకు అవసరమైన ఏర్పాట్లు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని,ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.పుష్కర ఘాట్ల ఏర్పాటుకు ప్రభుత్వం1వేయి కోట్ల రూపాయలు కేటాయించామని,ప్రజలకు అవసరమైన ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు,ప్రజా ప్రతినిధులు,హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్,అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

సూర్యతండా ప్రభుత్వ పాఠశాలలో ‘ఫ్రీ’ యూనిఫాం, షూస్ సూర్యతండా ప్రభుత్వ పాఠశాలలో ‘ఫ్రీ’ యూనిఫాం, షూస్
        కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 11, లోకల్ గైడ్ న్యూస్ : మండలంలోని సూర్యతండా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠశాల యూనిఫాంలు,
భూలోక్ రెడ్డి,భూక్య సతీష్ కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మిగౌడ్..
"కోట్ల మణిపూసలు"
మసీదులు.. కబురస్థాన్లకు నిధుల పోరాటం!
ప్రజల ఆకాంక్ష.. రాందాస్ నాయక్‌కు మంత్రి పదవి ఇవ్వాలి
"శ్రీ వినాయక నవరాత్రి ఉత్సవాల సమన్వయం - శాంతి భద్రతల పరిరక్షణ
సూధనపల్లి పాఠశాలలో ఉచిత యూనిఫామ్ పంపిణీ ...